జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి
మూసాపేట, ఫిబ్రవరి 26 : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న మనఊరు-మనబడి కార్యక్రమంతో విద్యావ్యవస్థలో సమూల మార్పు వస్తుందని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి అన్నారు. మూసాపేట ఉన్నత పాఠశాలను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన మనఊరు-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ తరహాలో మారనున్నాయని తెలిపారు.
వాలీబాల్ టోర్నీ ప్రారంభం
మూసాపేటలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నీని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను వెలికితీసేందుకు పోటీలు దోహదపడుతాయన్నారు. పో టీల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు స్నేహపూరిత వాతావరణంలో ఆటలు ఆడాలని సూచించారు. నేతాజీ యువజన సంఘం మాజీ అధ్యక్షుల స్మారకార్థం పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమాల్లో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీవో సరోజ, సర్పంచ్ చంద్రశేఖర్, భాస్కర్గౌ డ్, గూపని కొండయ్య, కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ జమీ ర్, కలీం, ఎస్ఎంసీ ఛైర్మన్ తిరుపతయ్య, ఒబెదుల్లాకొత్వాల్, మధుసూదన్‌రెడ్డి, టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి, శెట్టి శేఖర్, మశ్చేందర్నాథ్, తాజొద్దీన్, ఎస్సై నరేశ్ తదితరులు పాల్గొన్నారు.