చిన్నారులకు తప్పనిసరిగా చుక్కలు వేయించాలి
జిల్లాలో 5 ఏండ్ల లోపు చిన్నారులు 64,199 మంది
409 కేంద్రాలు, 1,636 మంది సిబ్బంది
61 హైరిస్క్ ప్రాంతాలు, 12 సంచార వైద్య బృందాలు
జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శైలజ
నారాయణపేట టౌన్, ఫిబ్రవరి 26 : 0 నుంచి 5 ఏండ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వే యించి తమ పిల్లలు పోలియో బారిన పడకుండా కాపాడాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శైలజ అన్నారు. పట్టణంలోని జిల్లా కార్యాలయంలో శనివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 11 మండలాలు, మూడు మున్సిపాలిటీల్లో పల్స్ పోలియో కా ర్యక్రమం విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. జిల్లాలో 5 ఏండ్ల లోపు చిన్నారులు మొ త్తం 64,199 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరందరికీ పోలియో చుక్కలు వేసేందుకు 40 9 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఒక్కో కేంద్రంలో నలుగురు చొప్పున సిబ్బంది 1,636 మంది పా ల్గొంటారని ఆమె తెలిపారు. జిల్లాలో మొత్తం 61 హైరిస్క్ ఉన్న ప్రాంతాల ను గుర్తించామని, ఇటుక బట్టీలు త యారు చేసే ప్రాంతాలు, మురికివాడ లు, చేపలు పట్టే ప్రాంతాలు, గుడిసె లు, దేశ దిమ్మరులు ఉండే ప్రాంతాలు, బొగ్గు బట్టీలు ఉన్న ప్రాంతాలు, భవన నిర్మాణ కార్మికులు ఉండే ప్రాంతాలు తదితర ప్రాం తాలు వీటి కిందికి వస్తాయన్నారు. అందులో 525 మంది చిన్నారులను గుర్తించినట్లు వివరించారు. 12 సంచార వై ద్య బృందాలు కూడా కార్యక్రమంలో పాల్గొంటాయన్నా రు. ఏ కారణంచేతనైనా 27న పోలియో చుక్కలు వేసుకొని పిల్లలకు 28న వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి చుక్కలు వేస్తారని ఆమె పేర్కొన్నారు.
విజయవంతం చేయాలి
ఆదివారం జిల్లాలో చేపట్టే పల్స్ పోలియో కార్యక్రమా న్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద పల్స్ పో లియో ర్యాలీని శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ పాతబస్టాండ్, సెంటర్ చౌక్ మీదుగా తిరిగి ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చే సేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధ్దం చేసిందన్నారు. ప్రతి ఏ డాది చుక్కల మందు కార్యక్రమం చేపట్టాల్సి ఉండగా కరో నా పరిస్థితుల కారణంగా రెండేండ్లుగా వాయిదా పడుతూ వచ్చిందన్నారు. కార్యక్రమంలో డీఎమ్హెచ్వో డాక్టర్ రా మ్మనోహర్రావు, గోవిందరాజు, వైద్య సిబ్బంది, ఆశ కా ర్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.