కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 26 : మహబూబ్‌నగర్ జిల్లాను మత్తుమందుల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ వెంకట్రా వు అన్నారు. జెడ్పీ సమావేశమందిరంలో శనివారం నిర్వహించిన నషాముక్త్ భారత్ జిల్లాస్థాయి అధికారుల సమ్మిళిత సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నషాముక్త్ భారత్ అమలులో మహబూబ్‌నగర్ జిల్లా ముందువరుసలో నిలువడం గర్వకారణమన్నారు. జిల్లాస్థాయి నుంచి క్షేత్రస్థాయివరకు మత్తు మందులను రూపుమాపేందుకు ఏజెంట్లా గా పని చేయాలన్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని సూ చించారు. మార్చి మొదటివారంలో బృందాలతో సమావే శం నిర్వహించాలని చెప్పారు. రానున్న మూడు నెలలపా టు ఇంకా విస్తృతంగా అమలు చేసేందుకు ప్రణాళిక రూ పొందించాలని ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ ద్వారా పెద్దఎత్తున దాడులు నిర్వహించి గం జాయి పంటను ధ్వంసం చేయడం, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం అభినందనీయమన్నారు. నషాముక్త్ భారత్‌పై ప నిచేస్తున్న ఇతర శాఖల అధికారులు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. ఇప్పటివరకు నషాముక్త్ భారత్‌పై నిర్వహించిన కార్యక్రమాలపై పుస్తకాన్ని ప్రచురించాలని జిల్లా పౌరసంబంధాల అధికారి వెంకటేశ్వర్లును ఆదేశించారు. వచ్చేనెలలో అన్ని మండలకేంద్రాల్లో 16 కళాజాత బృందాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని తెలిపారు. రిసోర్స్పర్సన్ల ద్వారా 10వేల మంది విద్యార్థులతోపాటు స్వయం సహాయక మహిళా సంఘాలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో నషాముక్త్ భారత్ రా ష్ట్ర కోఆర్డినేటర్ హరిత, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా సంక్షేమ అధికారి జరీనా, జెడ్పీ సీఈవో జ్యో తి, డీఆర్డీవో యాదయ్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైదు లు, జిల్లా ఇంటర్ విద్యాధికారి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ రమేశ్, డీపీఆర్వో వెంకటేశ్వర్లు, డీఈవో ఉషారాణి, ఎంజీవో రహమాన్ ఉన్నారు.