మరికల్, ఫిబ్రవరి 3 : గంజాయి, డ్రగ్స్‌ను అరికడదామని, పేటను గంజాయి రహిత జిల్లాగా మారుద్దామని ఉ మ్మడి జిల్లా ఎక్సైజ్ ఎస్పీ సైదులు పిలుపునిచ్చారు. గురువారం మండలకేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్లో మరికల్, నర్వ, ధన్వాడ మండలాల సర్పంచులు, ఎంపీటీసీలకు మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మ త్తుకు బానిసలు కాకుండా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామల్లో గంజాయి సాగు చేస్తే.. వారి కు టుంబంపై కేసులు నమోదు చేయడంతోపాటు రైతుబంధు నిలిపివేస్తామన్నారు. ఐదెకరాలకు మించి సాగుచేస్తే ఆ గ్రామంలోని అందరికీ రైతుబంధు డబ్బులు జమ కావని తెలిపారు.
గంజాయి సాగుచేసినా.. విక్రయిసుంచినా పో లీసులకు సమాచారం అందించాలన్నారు. పాన్‌షాపుల్లో గంజాయి, గుట్కా, డ్రగ్స్ అమ్మితే పీడీయాక్టు నమోదు చే స్తామని హెచ్చరించారు. మండల కేంద్రాల్లో గంజాయి వి క్రయాలు చాలా ఉన్నాయని, పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎక్సైజ్ ఎస్పీ సైదులు, నారాయణపేట డీఏస్పీ మధుసూదన్‌రావు, మరికల్ సీఐ శివకుమార్‌ను నర్వ మండల సర్పంచులు, ఎంపీటీసీలు సన్మానించారు. సమావేశంలో ఏస్సైలు, నారాయణ పేట ఆబ్కారీ ఎస్సై నాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.