మిడ్జిల్, ఫిబ్రవరి 9 : మండలంలోని మల్లాపూర్‌లో బుధవారం లక్ష్మీచెన్నకేశవస్వామి రథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జంగారెడ్డి, బంగారు, కృష్ణారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, వి ష్ణువాసురెడ్డి, వెంకటయ్య, శ్రీనివాస్‌రెడ్డి, రాంబాబు, శేఖర్, సత్యం, శ్రీ కాంత్, శ్రీను, మల్లేశ్, ప్రశాంత్ పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, ఫిబ్రవరి 9 : మండలకేంద్రంలో లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి గజవాహన సేవ నిర్వహించి పూజలు చేశారు.
అడ్డాకుల మండలంలో..
మూసాపేట(అడ్డాకుల), ఫిబ్రవరి 9 : మండలంలోని రాచాలలో చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే అఖండ భజనతో చెన్నకేశవస్వామి నామస్మరణ మార్మోగింది. ఉత్సవాలను పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి.