బాలబాలికల కడుపు నింపనున్న అల్పాహార పథకం
పాలమూరు జిల్లా ప్రభుత్వ బడుల్లో అమలు
తొలి దశలో 5 వేల మంది విద్యార్థులకు..
అత్యాధునిక సౌకర్యాలతో వంటశాల ఏర్పాటు
క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉదయం పూట విద్యార్థుల కడుపు నింపేందుకే అల్పాహార పథకాన్ని ప్రారంభించినట్లు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కోడూరులో అరబిందో ఫార్మా ఫౌండేషన్ అందించిన రూ.6 కోట్ల వితరణతో హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 వేల మందికి భోజనాలు అందించే సామర్థ్యంకలిగిన సెంట్రలైజ్డ్ కిచెన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు సంక్షేమ వసతి గృహాల్లో దొడ్డు బియ్యం, పురుగుల అన్నం భోజనంగా పెట్టేవారన్నారు.దీంతో విద్యార్థులు పస్తులు ఉండేవారని గుర్తు చేశారు. నేడు సీఎం కేసీఆర్ హయాంలో సర్కార్ బడుల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నట్లు చెప్పారు. హాస్టళ్లలో రుచికరమైన పౌష్టికాహారంఅందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
ఉమ్మడి రా ష్ట్ర పాలనలో సంక్షేమ వసతి గృహాల్లో దొడ్డు బియ్యం, పురుగుల అన్నంతో భో జనం అందించేవారని ఎక్సైజ్, క్రీడా శా ఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గుర్తు చేశారు. దీంతో విద్యార్థులు సక్రమంగా తినక ప స్తులున్న పరిస్థితులెన్నో ఉన్నాయన్నా రు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలో అన్ని పాఠశాలల్లో స న్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. హాస్టళ్లలో కూడా రుచికరమైన భోజనం అందిస్తున్నామని చెప్పారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కోడూరులో అరబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.6 కోట్ల వితరణతో హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 వే ల భోజనాలు అందించే సామర్థ్యం కలిగిన సెంట్రలైజ్డ్ కిచెన్, స్వాస్థ్య ఆహారం పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం అందించేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రా రంభించినట్లు వివరించారు. విద్యార్థులతోపాటు, పేదలు, దవాఖానల్లోని రో గుల సహాయకులకు హరే కృష్ణ మూమెంట్‌తో ఉచితంగా భో జనం అందించడం అభినందనీయమన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో అనేక మంది పేద విద్యార్థులు ఉదయం అ ల్పాహారం లేకుండానే పాఠశాలలకు వె ళ్తున్నారని, ఈ విషయం తెలుసుకున్న హరేకృష్ణ ట్రస్ట్ నుంచి మొదటి విడుతగా పాలమూరు నియోజకవర్గంలోని 20 వేల మంది విద్యార్థులకు అల్పాహా రం అందించేందుకు అరబిందో ఫార్మా ఫౌండేషన్ స్వస్థ్య ఆహార పథకాన్ని ప్రా రంభించినట్లు తెలిపారు. తొలి దశలో 5 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తామని, తర్వాత 20 వేల మందికి అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. హరే కృష్ణ మూమెంట్ ఫౌండేషన్ ఇలాంటి సేవలను రాష్ట్ర వ్యా ప్తంగా విస్తరించాలని ఆయన సూచించారు.
అదేవిధంగా అరబిందో ఫార్మా మహబూబ్‌నగర్ జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే అ వసరమైన సహాయ, సహకారాలు అం దిస్తామని మంత్రి పేర్కొన్నారు. హరేకృ ష్ణ మూమెంట్‌కు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, శ్రీమంతు లు తమవంతు సహకారం అందించాల ని విజ్ఞప్తి చేశారు. అనంతరం హరేకృష్ణ మూమెంట్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభూజీ మాట్లాడుతూ భోజనామృతం, అన్నపూర్ణ, సద్దిమూట, స్వస్థ్య ఆహార వంటి కార్యక్రమాలతో పేదల ఆ కలి తీర్చేందుకు తాము ప్రయత్నిస్తున్న ట్లు తెలిపారు. తమ ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వ సహకారం, ప్రోత్సాహం లభిస్తున్నదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా లో అనేక మంది నిరుపేదలకు సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు. అత్యాధునిక వంటశాల ఏర్పాటుతో కే వలం 15 నిమిషాల్లో వెయ్యి మందికి వండవచ్చని పేర్కొన్నారు. 2 గంటల్లో 5 వేల మందికి రుచికరమైన సాంబార్ తయారు చేయొచ్చని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అరబిందో ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, రైతుబం ధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, ఎంపీపీ సుధాశ్రీ, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, వైస్ ఎంపీపీ అనిత, స ర్పంచ్ శ్రీకాంత్‌గౌడ్ పాల్గొన్నారు.