మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
పట్టణంలోని అ య్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన మహాపడి పూజ కార్యక్రమాన్ని గు రువారం వైభవంగా నిర్వహించారు. గో పాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో మహాపడి పూజ ఉదయం 4గంటలకు గణపతి హోమంతో ప్రారంభించి అంబాభవాని ఆ లయంలోని స్వామి వారికి అభిషేకం చేసి కలశాలకు పూజ నిర్వహించారు.
- ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ
- కలశాలతో ఊరేగింపు నిర్వహించిన మాలధారులు
కొత్తకోట, డిసెంబర్ 15 : పట్టణంలోని అ య్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన మహాపడి పూజ కార్యక్రమాన్ని గు రువారం వైభవంగా నిర్వహించారు. గో పాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో మహాపడి పూజ ఉదయం 4గంటలకు గణపతి హోమంతో ప్రారంభించి అంబాభవాని ఆ లయంలోని స్వామి వారికి అభిషేకం చేసి కలశాలకు పూజ నిర్వహించారు. అనంత రం అక్కడి నుంచి మేళతాళలతో భాజాభజం త్రి, కొలటాలు, బతుకమ్మతో శోభాయాత్ర చేపట్టిన భూతనాథ అయ్యప్ప అన్నదాన క్షేత్రానికి చేరుకొని పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. శబరిమలలోని ఆభరణాలను ఊరేగించిన విధంగా పట్టణంలో ఏర్పాటు చేయడం అందరిని ఆకర్షించింది. ఈ కలశల ఊరేగింపులో జెడ్పీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్, ఎంపీపీ గుంతమౌనిక, ము న్సిపల్ చైర్పర్సన్ సుకేశిని శోభయాత్రలో పాల్గొన్నారు. అయ్యప్ప సేవాసమితి అధ్యక్షుడు దూపం నాగరాజు, కర్నూ ల్ నుంచి హరినారాయణ గురుస్వామి పా ల్గొన్నారు. సాయంత్రం 6:30 గంటలకు మహాపడి పూజ నిర్వహించగా పట్టణమం తా అయ్యప్పనామస్మరణతో మార్మోగింది. కార్యక్రమంలో లింగేశ్వర్, అనిల్, కిశోర్, సుధాకర్‌రెడ్డి, రఘు, కిరణ్ ఉన్నారు.
గోపాల్‌పేటలో..
మండల కేం ద్రానికి చెందిన కాశీపతి గురుస్వామి 18 వ పడి, 18వ శబరిమల యాత్ర సందర్భంగా గురువారం మండలకేంద్రంలో ముత్తు కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించా రు. వంద మందికి పైగా అయ్యప్పమాలధారులు గణపతి హోమం, గోపూజ, అయ్య ప్ప అభిషేకం, అష్టోత్తరం, పడిపూజ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కాశీపతి గురుస్వామిని స్వాములు సన్మానించారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, అయ్యప్పమాలధారులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

