జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం పరుమాల గ్రామంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. పరమాల గ్రామ శివారులోని శ్రీ రంగనాథ స్వామి ఆలయ ఆవరణలో ఉన్న శివలింగం, వినాయక విగ్రహాల కింద తవ్వకాలు జరిపినట్లుగా గ్రామస్తులు గుర్తించారు.
సుమారు నాలుగు అడుగుల లోతు గుంతను తవ్వినట్లుగా పరిమాల గ్రామస్తులు గుర్తించారు. గతంలో కూడా ఈ ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు, సంబంధిత అధికారులు విచారణ చేపట్టాలని.. తవ్వకాలకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.