గద్వాల న్యూటౌన్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో సహ మరో ముగ్గురితో కలిసి కట్టుకున్న భార్య తన భర్తను హత్య చేసింది. వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన చుక్కరాజును తన భార్యే హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
సోమవారం జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కు మార్ వివరాలు వెల్లడించారు. మక్తల్ మండలం, భగవాన్‌పల్లి గ్రామానికి చెందిన మాధవికి 11 ఏండ్ల క్రితం వనపర్తి జిల్లా అమరచింత మండలం, నందిమల్ల గ్రామానికి చెందిన చుక్క రాజుతో వివాహమైంది. కాగా వీరిద్దరికి ముగ్గురు సంతానం.
ఇదిలాఉండగా రెండేండ్ల క్రితం గద్వాల మండంలోని తుర్కొనిపల్లి గ్రామ శివారులోని అలూరు రాములుకి చెందిన బత్తాయి తోటలో పనికి వచ్చి స్ధిర పడ్డారు. అయితే మాధవికి భగవాన్‌పల్లికి చెందిన బోయ మునేశ్ అలియాస్ కలవాల్ దొడ్డి మునేశ్‌తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఈ విషయం రాజుకు తెలిసి పలుమార్లు మందలిం చాడు. అయినా ఆమే ధోరణిలో మార్పురాలేదు. 3నెలల క్రితం భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో మళ్లీ మునేశ్‌తో అక్రమ సంబంధం కొనసాగించింది. నెల క్రితం రాజు మాధవిని బ్రతిమాలి కాపురానికి తీసుకోచ్చాడు.
అతనితో కాపురానికి ఇష్టం లేని మాధవి తన వివాహేత సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని, ఎలాగైనా భర్తను వదిలిం చుకోవాలని ప్రియుడు మునేశ్‌తో సహ కుంటి జైపాల్, బోయ రవి, రవీంద్రలతో కలిసి పథకం వేసింది. హత్యకి సహకరిం చినందుకు ముగ్గురితో రూ.10వేలు చొప్పున ఇస్తామని మాధవి ప్రియుడు మునేశ్లు ఒప్పందం కుదుర్చున్నారు.
ఈ నెల 1న వివాహేత సంబంధానికి అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారం రాజుకు అన్నంలో నిద్ర మాత్రలను పౌడర్ గా చేసి కలిపి నిద్రలోకి జారుకునేలా చేసి అనంతరం ప్రియుడు మునేశ్కు ఫోన్ చేసింది. అదే రాత్రి తుర్కోనిపల్లి శివారులో బత్తాయి తోటలో నిద్రమత్తులో ఉన్న రాజును అందరూ కలిసి మెడకు తాడు బిగించి హతమార్చారు.
ఆనంతరం హత్యను ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో మరణించినట్లుగా చిత్రీకరించేందుకు తోట సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫా ర్మర్ దిమ్మెపై పడేశారు. అ రోజు రాత్రి మునేశ్ మాదవితో గడిపి ఉదయం మృతుడి సెల్‌ఫోన్ తీసుకువెళ్లాడు. ఉదయం తోటలో పనికి వచ్చిన రామాంజీ అనే వ్యక్తితో తన భర్త రాత్రి నుంచి కనబడంలేదని, వెళ్లి చూసి రమ్మని చెప్పింది.
ఈ క్రమంలో రాజు మృతదేహం ట్రాన్స్‌ఫార్మ్ దిమ్మెపై ఉన్నట్లుగా గుర్తించాడు. ఈ క్రమంలో రామాంజి మాదవిని అనుమా నించి తోట యజమానికి ఫోన్ చేయగా ఎడ్చినట్లుగా నటిస్తూ అక్కడి నుంచి పరారైయిందన్నారు. ఈ నెల 2న మృతుడు రాజు సోదరుడు చుక్క నరేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
విచారణలో హత్య చేసినట్లు అంగీకరించడంతో మాధవి, మునేశ్, కుంటి జైపాల్, రవి, రవీంద్రలను రిమాండ్‌కు తరలించి నట్లు ఎస్పీ తెలిపారు. వీరి నుంచి ఉరితాడు, మోటారు సైకిల్, 4సెల్ఫోన్లతో పాటు మృతుని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసు కున్నట్లు వెల్లడించారు.
ఫిర్యాదు అందిన అతి తక్కువ సమయంలో కేసు మిస్టరీని ఛేధించిన డీఎస్పీ రంగస్వామి, గద్వాల సీఐ షేక్ మహబూబ్ బాష, పీఎస్సై గాయిత్రి, సిబ్బంది సమరసింహా రెడ్డి, అశోక్, రాజశేఖర్, రాజేందర్, రమేశ్‌లను ఎస్పీ ఆభినందించారు. ఈ సమావేశంలో గద్వాల సీఐ షస్త్రక్ మహబూబ్ బాష, రూరల్ ఎస్సై గాయిత్రి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.