కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా సరిగా అమలు చేయడం లేదు. రైతు భరోసా, రైతు భీమా, రుణ మాఫీ, కళ్యాణ లక్ష్మీ వంటి కేసీఆర్ పదేళ్లపాటు నిర్విఘ్నంగా అమలు చేసిన ఒక్క పథకాన్నిప్రజలకు ఇవ్వట్లేదు. దానికితోడు రైతలకు వడ్ల బోనస్ హామీని కూడా అందరికీ ఇవ్వట్లేదు. రైతులనుండి వడ్లు కోనుగోలు చేసినా ఇప్పటివరకు బోనస్ ఇవ్వలేదు. తమకు బోనస్ ఇవ్వాలంటూ బైరాపురం రైతులు సోమవారం గద్వాల జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు.
వడ్లు కోనుగోలు చేసి సీజన్ మారిపోయినా ఇంకా బోనస్ ఇవ్వలేదని, యాసంగి వడ్లు కూడా అమ్మే సమయం వచ్చిందని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఇంకా బోనస్ ఇవ్వలేదని రైతులు అంటున్నారు. రైతులకు వానాకాలంలో పండించిన పంటకు ఇంకా బోనస్ ఇవ్వలేదు. యాసంగి పంటకు నీళ్లివట్లేదు. రైతు భరోసా ఇవ్వట్లేదు. రుణమాఫీ అందరికీ చేయలేదు. రైతును ఎడ్పించిన ప్రభుత్వం తగిన మూల్యం చెల్లిస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ చొరవ చూపి తాము అమ్మిన వడ్లకు బోనస్ ఇప్పించాలని కోరారు.