సీఎం కేసీఆర్ షెడ్యూల్లో స్వల్ప మార్పు
వనపర్తిలోనే కర్నెతండా లిఫ్ట్‌కు శంకుస్థాపన
ఏప్రిల్ తర్వాత కొత్త పింఛన్లు
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
బుగ్గపల్లితండా, శారాగట్టు మినీ లిఫ్ట్లుప్రారంభం
వనపర్తి, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : వనపర్తిలో ఈనెల 8న నిర్వహించే సీఎం సభ చరిత్రలో నిలిచిపోవాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. శనివారం టీఆర్ఎస్ శ్రేణులు ప్రజా ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో స్వల్ప మార్పు చేసినట్లు వెల్లడించారు. కర్నెతండా లిఫ్ట్‌ను వనపర్తిలోనే శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఇదిలా ఉండగా మంత్రి పెద్దమందడి మండలంలోని బుగ్గపల్లితండాలో మినీ లిఫ్ట్, మోజర్ల గ్రామంలోని అరబిందో ఫార్మా సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన శారాగట్టు మినీ లిఫ్ట్‌ను ప్రారంభించారు. అనంతరం అనకాయపల్లి తండాలో ‘మా తోట’ గిరిజన అభివృద్ధి పథకానికి శ్రీకారం చుట్టారు.
వనపర్తిలో నిర్వహించే సీఎం కేసీఆర్ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోవాలని వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. శనివా రం టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 8న సీఎం కేసీఆర్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసినట్లు వెల్లడించారు. కర్నెతండా లిఫ్ట్‌ను కర్నెతండాకు బదులుగా వనపర్తిలోనే శంకుస్థాపన చేయనున్నట్లు చె ప్పారు. హైదరాబాద్ నుంచి వనపర్తికి నేరుగా హె లీకాప్టర్లో వచ్చి.. సాయంత్రం 5:25 వరకు కా ర్యక్రమాలను ముగించుకొని హెలీకాప్టర్‌లో తిరు గు ప్రయాణమవుతారన్నారు. మొదట చిట్యాల సమీపంలో వనపర్తి మార్కెట్ యార్డును ప్రారంభించి.. అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, సమీకృత కలెక్టరేట్ నూతన భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. కర్నెతండా లిఫ్ట్, వేరుశనగ పరిశోధన కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, నూతన మెడికల్ కళాశాలలకు ఒకేచోట శంకుస్థాపన శిలాఫలాకాలను ఆవిష్కరిస్తారన్నారు. వనపర్తికి దాదాపు రూ.20 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ పనులు వచ్చాయని, తాజాగా మరో రూ.5.15 కోట్లు మంజూరయ్యాయన్నారు. వీటి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు.
అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నాం..
పెద్దమందడి, మార్చి 5 : రాష్ట్ర ప్రభుత్వం అ న్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నదని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శనివారం మండలంలో ని బుగ్గపల్లితండాలో మినీ లిఫ్ట్, మోజర్ల గ్రామం లో అరబిందో ఫార్మా సంస్థ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన శారాగట్టు మినీ లిఫ్ట్, అనకాయపల్లి తండాలో నాబార్డు మా తోట గిరిజన అభివృద్ధి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల అనంతరం ఏప్రిల్ తర్వాత 57 ఏండ్లు నిండిన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. సొంత జాగా లో ఇల్లు కట్టుకునేవారికి విడుతల వారీగా సా యం అందిస్తామన్నారు. కానాయపల్లి శంకరసముద్రం నుంచి లిఫ్ట్ ఏర్పాటు చేసి మండలంలో ని బుగ్గపల్లి తండా, కావలి గుడిసెలకు సాగునీరు ఇస్తున్నామన్నారు. మోజర్లలో ఎత్తు ప్రాంతాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అరబిందో ఫార్మా ఫౌండేషన్, రామ్కీ సంస్థ సహకారంతో రూ.1.80 కోట్లు వెచ్చించి కానాయపల్లి శంకరసముద్రం నుంచి మోజర్ల శారాగట్టు వరకు ఆరు మోటార్ల సాయంతో రెండు పైపులైన్లతో సాగునీ రు అందిస్తున్నామన్నారు. ఇంకా 300 ఎకరాల కు సాగునీరు అందడం లేదని గ్రామస్తులు మం త్రి దృష్టికి తీసుకురాగా.. వచ్చే తోలైటి నాటికి మి నీ లిఫ్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్క డా లేని విధంగా ఆధునిక నూతన వ్యవసాయ మార్కెట్‌యార్డును జిల్లాలో నిర్మించినట్లు తెలిపా రు.
గిరిజన రైతుల అభివృద్ధి కోసం నాబార్డు, రా మ్కీ సంస్థ సహకారంతో రూ.4.50 కోట్లు వె చ్చించి నాబార్డు మా తోట గిరిజన అభివృద్ధి పథకాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ పథకంలో భాగంగా తండాల్లో చెక్‌డ్యాంలు నిర్మించి.. రైతులను పండ్ల తోటల పెంపకం, కూ రగాయలు తదితర పంటల సాగు దిశగా ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. వనపర్తికి అనకాయపల్లి తండా చాలా దగ్గర్లో ఉందని.. కావున రైతులు పండ్లు, కూరగాయల సాగుపై దృష్టి సారించి అధి క లాభాలు గడించాలన్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మండలం నుంచి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, మండలాధ్యక్షు డు రాజాప్రకాశ్రెడ్డి, ఎంపీపీ మేఘారెడ్డి, జెడ్పీటీ సీ రఘుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వే ణు, అరబిందో ఫార్మా కంపెనీ సభ్యుడు సదానందారెడ్డి, రామ్కీ సంస్థ సభ్యుడు రాంరెడ్డి, నాబా ర్డు డీజీఎం సంతానం, నాగార్జున, సింగిల్‌విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రఘుప్రసాద్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటస్వామి, సర్పంచులు కవిత, అనిత, లక్ష్మి పాల్గొన్నారు.