‘మన ఊరు – మన బడి‘ కార్యక్రమానికి శ్రీకారం
నూతన కలెక్టరేట్, మార్కెట్ యార్డు ప్రారంభం
కర్నెతండా లిఫ్ట్ పనులకు శంకుస్థాపన
వనపర్తిలో భారీ బహిరంగ సభ
వనపర్తి, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ) : ‘మన ఊరు – మన బడి‘ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వనపర్తి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఈమేరకు ఈనెల 8న ముఖ్యమంత్రి వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా.. జిల్లా కేంద్రం నుంచి ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనం ప్రారంభం, రూ.72 కోట్లతో చేపట్టనున్న కర్నెతండా లిఫ్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటు వనపర్తిలో నిర్మించిన వ్యవసాయ మార్కెట్, టీఆర్ఎస్ పార్టీ వనపర్తి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. వనపర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని సీఎం ప్రసంగిస్తారు.