సీఎం కేసీఆర్ సభను సక్సెస్ చేయాలి
40 ఎకరాల్లో బహిరంగ సభాస్థలి
పార్కింగ్‌కు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జి ల్లాలో ఈనెల 8న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సం దర్భంగా నిర్వహించే సభకు పల్లెలన్నీ కదిలి.. ప్రగతిని పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని వ్య వసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్న సీఎం బహిరంగ సభా స్థలంతోపాటు టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయా న్ని అధికారులు, పార్టీ నేతలతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జిల్లా పర్యటన నేపథ్యంలో 40 ఎకరాల్లో సభాస్థలి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు భారీగా తరలొచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వ చ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, పార్కింగ్ సౌ కర్యం కల్పించనున్నట్లు చెప్పారు. అభివృద్ధి చెందిన ని యోజకవర్గాల వరుసన వనపర్తి నిలిచిందని పేర్కొన్నా రు. ఏడేండ్లలో వేల కోట్ల రూపాయలతో పల్లెపల్లెనా అ భివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు. సాగునీటి రాక తో జిల్లాలోని బీడు భూములు సస్యశ్యామలంగా మా రాయని మంత్రి పేర్కొన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యం తో నేలలు బీళ్లుగా మారగా.. నేడు మూడు పంటలు పండుతూ పచ్చని పైర్లు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆస రా పథకాలతో పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని చెప్పారు. వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటుతో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. మోటర్లను , స్టార్టర్లను గుంజుకుపోయే పరిస్థితి నుంచి పంట పండించుకునే వరకు రైతులకు నిరంతర విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. కేసీఆర్ రైతుల పక్షపాతి అని, వారి కష్టాలు తెలిసినందుకే వ్యవసాయ అనుకూల విధానాలు అవలంభిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఆర్అండ్బీ డీఈ దేశ్యానాయక్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, నాయకు లు తదితరులు పాల్గొన్నారు.