దాడి చేసిన నిందితులను వదిలిపెట్టి బాధితులపై కేసు నమోదు చేసి వేధిస్తున్నారని కేటీదొడ్డి ఎస్ఐపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం… కేటిదొడ్డి మండలం పూజారీ తండాకు చెందిన బాధితులు రామచంద్రనాయక్, అతని కుటుంబ సభ్యులు సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రామచంద్రనాయక్, గోవింద్ నాయకులపై అదే గ్రామానికి చెందిన తిమ్మానాయక్, వెంకటేష్ నాయక్, నర్సింహులు నాయక్, చిన్న వీరేష్ నాయక్, పెద్ద వీరేష్ నాయక్, రాములు నాయక్, రమేష్ నాయక్, లలితమ్మ అందరు కలిసి ఈ నెల 10న పాతకక్షల నేపథ్యంల దాడికి పాల్పడినట్లు సమాచారం.
ఈదాడిలో రామచంద్రానాయక్ దవడ చీలి, పండ్లు ఊడిపోవడంతో డయల్ 100 కు పోన్ చేయగా సంఘటన స్థలానికి కేటిదొడ్డి ఎస్ఐ శ్రీనివాసులు ఆలస్యంగా వచ్చి విచారించారు. తమపై దాడి చేసినవారిపై కేసు నమోదు చేయాలని ఎస్ఐకి రామచంద్రనాయక్ ఫిర్యాదు చేశారు. నిందుతులతో కుమ్మక్కైన ఎస్ఐ ఉల్టా తమపై కేసు నమోదు చేశారని బాధితులు వాపోయారు. అన్ని సాక్ష్యాదారాఉ ఉన్నా ఎస్ఐ కేసు పెట్టలేదని చెప్పారు.