గద్వాల అర్బన్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కొందరు నేతలు చాలా గలీజ్గ తయారండ్రు. అధికారం ఉంది గదా తమను ఎవరు ఏం చేయలేరని ధీమాతో గబ్బు పనులకు పాల్పడుతున్నారు. గ్రామాల్లో లీడర్లయితే ఇక చెప్పనవసరం లేదు. రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని మహిళల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. కొంత మంది వావి వరుసలు కూడా చూడట్లేదు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు, కేటీదొడ్డి మండలాల్లోని పలు గ్రామాలలో చోటు చేసుకున్నపనులు సభ్యసమాజం తలదించుకునేవిధంగా ఉన్నాయి.
గట్టు మండలంలోని మిట్టదొడ్డి గ్రామంలో ఓ మాజీ సర్పంచ్ ఆమాయక మహిళలను టార్గెట్ చేసి తన పలుకుబడ్డి ఉపయోగించుకుని లైంగికంగా వాడుకుంటున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. తన కొర్కెను తీర్చన మహిళలను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి లొంగదీసుకుంటాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే కేటీ దొడ్డి మండలం మల్లాపురం గ్రామంలోనూ ఓ మాజీ సర్పంచ్ తన డబ్బు, అధికారం మదంతో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా మహిళపై కన్నుపడితే తన వశం చేసుకునే వరకు వదిలిపెట్టడని ఆ ఊరి వాళ్లు మాట్లాడుకుంటున్నారు.
అయితే.. ఈ వ్యవహారంపై బాధిత మహిళలు రహస్యంగా పోలీసు డిపార్ట్మెంట్లోని పై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకు అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తున్నది. గలీజ్ పనులు చేసే గబ్బుగాళ్లను లోపలేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.