స్వార్థ ప్రయోజనాల కోసమే మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కుట్ర
విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు
మహబూబ్‌నగర్, మార్చి 5 : మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్యవైశ్య సంఘం నాయకుడు చెరుకుపల్లి రాజేశ్వర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య సం ఘం కల్యాణమండపంలో శనివారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వార్థ ప్రయోజనాల కోసం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కుట్రలు చేయడం సరికాదన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మ హబూబ్నగర్ను అభివృద్ధి చేస్తున్న మం త్రిపై కుట్రలు చేస్తున్న వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు ప్రమోద్‌కుమార్, మనోహర్, చక్రధర్గుప్తా తదితరులు ఉన్నారు.
గౌడ సంఘం నాయకుల నిరసన
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర చే యడంపై గౌడ సంఘం నాయకులు స్థానిక తెలంగాణ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశా రు. మహబూబ్‌నగర్ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న మంత్రి హత్యకు కుట్రలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్, నరేందర్‌గౌడ్, రాంనాథ్గౌడ్, జగన్మోహన్గౌడ్, ప్రతాప్‌గౌడ్, సుభాష్‌గౌడ్, సుందరయ్యగౌడ్, లక్ష్మీనారాయణగౌడ్, మురళీగౌడ్, రాజశేఖర్గౌ డ్, గోపికృష్ణగౌడ్, బాలాగౌడ్ పాల్గొన్నారు.
ఖండించిన ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, మార్చి 5 : మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర చేయడాన్ని ఎక్సైజ్ హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్ అసోసియేషన్ జిల్లా నాయకులు ఖండించా రు. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయ ఆవరణలో నిరసన వ్య క్తం చేశారు.. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా నాయకుడు రమేశ్‌సింగ్ మాట్లాడుతూ స్వ రాష్ట్ర సాధనలో ముఖ్యభూమిక పోషించి తె లంగాణ పునర్నిర్మాణానికి శ్రమిస్తున్న మం త్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.కృష్ణగౌడ్, అసోసియే ట్ అధ్యక్షుడు నతానియిల్, ఉపాధ్యక్షుడు సనాతన బాలరాజు, కార్యనిర్వాహణ కార్యదర్శి ధాములనాయక్, రవీందర్‌గౌడ్, చి న్నానాయక్, మధుసూదన్ పాల్గొన్నారు.
పేదల మనిషి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్‌టౌన్, మార్చి 5 : పేద ల మనిషి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అని ము స్లిం సంఘాల నాయకులు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్ఎం ఫంక్షన్హాల్లో ఏర్పా టు చేసిన సమావేశంలో మాట్లాడారు. మం త్రి హత్యకు కుట్ర పన్నడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మహబూబ్‌నగర్ అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి రా జకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో ముస్లిం సంఘాల నాయకు లు ఇఫ్తెకార్ అహ్మద్, అన్వర్‌పాషా, సమాద్ఖాన్, అహ్మద్, అన్వర్, సలీంనవాబ్, నూరుల్‌హాసన్, హఫెజ్ ఇద్రీస్, ఖదీర్, వహిద్షా తదితరులు ఉన్నారు.
హత్యాయత్నం హేయమైన చర్య
కోయిలకొండ, మార్చి 5 : మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర చేయడం హేయమైన చర్య అని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొత్లాబాద్ రాజేంద్రప్రసాద్‌గౌడ్ అన్నారు. శనివారం మండలకేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజాసంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్రలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కుట్రలు చేస్తే సహించం
హన్వాడ, మార్చి 5 : అందరి సంక్షేమానికి పాటుపడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కుట్రలు చేస్తే సహించమని టీఆర్ఎస్ ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు రామాంజనేయులు హెచ్చరించారు. మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొందరు మంత్రిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ హత్యకు కుట్ర పన్నడం హేయమైన చర్యన్నారు. సమావేశంలో ఎస్సీ సెల్ నాయకులు ఆంజనేయులు, రా ములు, బాలకిష్టయ్య, జంబులయ్య, మాజీ ఎంపీటీసీ నాగన్న, సర్పంచ్ వెంకటన్న, మాజీ సర్పంచ్ బాలకిష్టయ్య, గంగాపూరి, యాదయ్య, అరవింద్, దశరథం, వెంకటయ్య తదితరులు ఉన్నారు.