ఉండవెల్లి: అలంపూర్ నియోజకవర్గంలో అత్యవసర ప్రాంతాలలో బ్రిడ్జీ నిర్మాణాలు చేపట్టాలని ఎమ్మెల్యే అబ్రహం రాష్ట్ర పం చాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రవల్లిదయాకర్ రావును కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్ట
ర్స్లో మంత్రి ఎర్రబెల్లిని ఎమ్మెల్యే అబ్రహం కలిసి మానవపాడు మండలం కొర్విపాడు నుంచి మద్దూరుకి వెళ్లే దారిలో బ్రిడ్జి, ఐజ మండలం చిన్న తాండ్రపాడు తదితర బ్రిడ్జిలను అత్యవసరంగా నిర్మించాల్సిన అవసరం ఉందని మంత్రికి వివరించారు.