కలెక్టర్ వెంకట్రావు
భూత్పూర్, ఫిబ్రవరి 23: మున్సిపాలిటీ పరిధిలోని సారిక టౌన్షిప్లో ్ల కలెక్టర్ వెంకట్రావు బుధవారం హరిత హారం కార్యక్రమాన్ని పరిశీలించారు. బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ రూ.50లక్షలతో పచ్చదనం, సుందరీకరణతో అందంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన తెలిపారు. సారికా టౌన్షిపులో ఎక్కువ సంఖ్యలో మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంచాలని కోరారు. మార్చ్ 14నుంచి 17వ తేదీల మధ్య ప్లాట్ల వేలం వేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్, మిషన్‌భగీరథ ఎస్ఈ వెంకటరమణ, హౌసింగ్ ఈఈ భాస్కర్, హార్టికల్చర్ డీడీ సాయిబాబా, కమిషనర్ నూరుల్‌నజీబ్ తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకతకు మారుపేరు ఈ-ఆఫీస్
మహబూబ్‌నగర్ ఫిబ్రవరి 23 : ఎక్కడ ఏ ఫైల్ ఉందనే విషయాన్ని వెంటనే తెలుసుకోవడంతోపాటు ఎక్కడ ఉన్నా విధుల్లో ఉండేందుకు ఈ-ఆఫీస్ ప్రక్రియ ఉపయోగపడుతుందని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్లో సంబంధింత జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ-ఆఫీస్ సేవలతో ఇప్పటికే జిల్లాకు పలు అవార్డులను సొంతం చేసుకున్నామన్నారు. ఈ-ఆఫీస్ సేవలను పారదర్శకంగా కొన సాగించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సీతారామరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.