మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, ఫిబ్రవరి 16: పట్టణంలోని తాళ్ల చెరువు సుందరీకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, సంబంధిత కాంట్రాక్టర్‌తో కలిసి సుందరీకరణ పనులను మంత్రి బుధవారం పరిశీలించారు. చెరువును మినీట్యాంక్ బండ్‌గా మారుస్తున్నామని, రూ.కోటితో సీసీరోడ్డు నిర్మాణం, ఇరిగేషన్ శాఖ నుంచి రూ.50లక్షలతో కట్ట పునరుద్ధరణ చేస్తామన్నారు. పనులు నాణ్యతగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వివరించారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
వనపర్తి , ఫిబ్రవరి 16: జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 50మందికి మంజూరైన చెక్కులను మంత్రి నిరంజన్‌రెడ్డి బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్, ఆయా మండలాలు, నాయకులు పాల్గొన్నారు.
బొడ్రాయి ఉత్సవాల్లో
పెద్దమందడి, ఫిబ్రవరి 16: మండలంలోని అమ్మపల్లి గ్రామంలో బుధవారం చేపట్టిన బొడ్రాయి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బొడ్రాయి వద్ద మంత్రి పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేశ్, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రామస్తులు రామేశ్వర్‌రెడ్డి, బాలు తదితరులు ఉన్నారు.