గద్వాల రూరల్, ఫిబ్రవరి16: తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ జీవితం ప్రజా సేవకే అంకితమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రెండోరోజు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతోపాటు ఆయన సతీమణి బండ్ల జ్యోతి రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. శిబిరంలో దాదాపు 100మంది ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, జెడ్పీవైస్ చైర్పర్సన్ సరోజమ్మ, వినియోగదారుల ఫోరం మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్‌ఎంపీపీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్లు, పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రోగులకు పండ్లు, పాలు
ధరూరు, ఫిబ్రవరి 16: సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్సేర్ పీహెచ్‌సీలోని రోగులు, బాలింతలకు మాల్‌దొడ్డి సర్పంచ్ పద్మమ్మ ఆధ్వర్యంలో బుధవారం పాలు, బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రదాన కార్యదర్శి అంజిసాగర్, రాజు, శ్రీరాములు, వైద్యులు పాల్గొన్నారు.
కేసీఆర్ కారణజన్ముడు
వడ్డేపల్లి, ఫిబ్రవరి 15: సీఎం కేసీఆర్ కారణజన్ముడని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే అబ్రహం కుమారుడు అజయ్ అన్న యువసేవ ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో బుధవారం శాంతినగర్‌లోని భవానీ ఫంక్షన్హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే అబ్రహం ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే కుమారుడు అజయ్ మాట్లాడుతూ కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పదిమంది ప్రాణాలు నిలబెట్టే రక్తాన్ని రక్తదాన శిభిరం ద్వారా సేకరించడం సంతోషమని, స్వచ్ఛందంగా తరలివచ్చి సుమారు 400 మందికి పైగా రక్తదానం చేశారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కరుణ, ఎంపీపీ రజితమ్మ, జెడ్పీటీసీ కాశపోగురాజు, నాయకులు సీతారామిరెడ్డి, రాజు, టీఆర్ఎస్ నాయకులు రెడ్‌క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శాంతినగర్‌లో..
అలంపూర్,ఫిబ్రవరి 16: సీఎం కేసీఆర్ జన్మదినం వేడుకలలో భాగంగా శాంతినగర్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి రక్తదాన శిబిరానికి అలంపూరు మండలం నుంచి టీఆర్ఎస్ నాయకులు భారీగా తరలివెళ్లారు. మున్సిపల్ చైర్పర్సన్ భర్త వెంకటేశ్ శిబిరంలో రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రహంతోపాటు నారాయణరెడ్డి, సుదర్శన్ గౌడ్, వెంకట్రామయ్యశెట్టి, శీను, శేఖర్, నర్సన్‌గౌడ్, బీచుపల్లి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.