గెరిల్లా యుద్ధ వ్యూహాలకు ఛత్రపతి శివాజీ ప్రసిద్ధి
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, ఫిబ్రవరి 19 : ఛత్రపతి శివాజీని యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని బాల్నగర్ అభయాంజనేయస్వామి ఆలయం వద్ద శోభాయాత్ర కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన శివాజీ విగ్రహానికి మంత్రి పూలమాల వే శారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ 17 ఏండ్ల వయస్సులోనే శివాజీ యుద్ధం చేసి బీజాపూర్ రాజ్యంలోని తోర్నకోట్ను వశం చేసుకున్నారని చెప్పారు. గెరిల్లా యుద్ధ వ్యూహా లు రచించడంలో ఛత్రపతి శివాజీ ఎంతో సిద్ధహస్తుడన్నారు. పరిపాలనా విధానంలో అగ్రగణ్యుడిగా ఛత్రపతి పేరొందారని చెప్పారు. ఆయన రాజ్యంలో మంత్రి మండలి, విదేశాంగ విధానంతోపాటు గూఢాచారి వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ప్రభువుగా ప రిపాలన కొనసాగించారని గుర్తు చేశారు. హిందూ దేవాలయాలతోపాటు అనేక మసీదులు కట్టించారని, సైన్యంలో మూడో వంతు ముస్లింలే ఉండేవారన్నారు. హైదర్ అలీ, ఇబ్రహీంఖాన్, సిద్ధి ఇబ్రహీం వంటి వారు సైన్యంలో కీలక పదవుల్లో కొనసాగారని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు శాంత, కృష్ణయ్య, మాజీ కౌన్సిలర్ వసంత, శివాజీ శోభాయాత్ర ఉత్సవ కమిటీ సభ్యులు మాధవరావు సునీల్ వాల్మీకి, రాము, భానుయాదవ్, ప్రశాంత్, శ్రావణ్‌కుమార్, పవన్, మహేశ్, శేఖర్, చిన్న తదితరులు పాల్గొన్నారు.
బొడ్రాయి ఉత్సవాలకు హాజరు..
పెద్దమందడి, ఫిబ్రవరి 19 : మండలంలోని చిలకటోనిపల్లిలో నిర్వహిస్తున్న బొడ్రా యి పునఃప్రతిష్ఠ ఉత్సవాలకు మంత్రి నిరంజన్‌రెడ్డి హాజరై పూజలు చేశారు. ప్రజలంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.