ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి
బాలానగర్, ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ దేశభక్తి స్ఫూర్తి దాయకమని, ఆయన అడుగుజాడల్లో నడుద్దామని గిరిజన రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్‌నాయక్ అన్నారు. మండలంలోని కేతిరెడ్డిపల్లిలో శనివారం ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఆరెకటిక సంఘం నాయకులు యాదిలాల్, రాజు, సర్పంచ్ రాంరెడ్డి, లక్ష్మణ్‌నాయక్ పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్ల, ఫిబ్రవరి 19: మండలంలోని గంగాపూర్‌లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి పూలమాలవేసి ట్రాక్టర్‌పై ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు మహేశ్, ఉపాధ్యక్షుడు నాగస్వామి, సభ్యులు గౌరీశంకర్, చంద్రప్రకాశ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని శనివారం మండలంలో ఘనంగా నిర్వహించారు. మండలకేంద్రంతోపాటు తిర్మలాపూర్, చొక్కంపేట, దోండ్లపల్లి, చెన్నవెల్లి, కుచ్చర్కల్, ఈద్గాన్‌పల్లిలో యువకులు, యువజన సంఘాల నాయకులు శివాజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, రామకృష్ణగౌడ్, వెంకట్రాంరెడ్డి, శేఖర్‌గౌడ్, పుల్లారెడ్డి, వెంకటేశ్, రవి పాల్గొన్నారు.
ఉమ్మడి గండీడ్ మండల వ్యాప్తంగా..
గండీడ్/మహ్మదాబాద్, ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ జయంతిని ఉమ్మడి గండీడ్ మండలవ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. గండీడ్ మండలం వెన్నాచేడ్, కప్లపూర్, పెద్దవార్వల్, గండీడ్, మహ్మదాబాద్ మండలంలోని నంచర్ల, మొకర్లబాద్, వెంకట్‌రెడ్డిపల్లి, కంచన్‌పల్లి, జూలపల్లి తదితర గ్రామాల్లో శివాజీ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం యువకులు గ్రామాల్లో బైక్‌లపై ర్యాలీ నిర్వహించారు. మహ్మదాబాద్‌లో బీజేపీ నాయకులు రక్తదానం చేశారు. కార్యక్రమాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, యువకులు పాల్గొన్నారు.
వీరత్వానికి ప్రతీక..
మహబూబ్‌నగర్ క్లాక్‌టవర్, ఫిబ్రవరి 19: వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ అని మాలమహానాడు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కానుగడ్డ యాదయ్య అన్నారు. ఆ సంఘం ఆధ్వర్యంలో శనివారం శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బాలరాజు, కృష్ణయ్య, చెన్నయ్య, రాములు, శ్రీనివాసులు, చెన్నయ్య, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.