తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలు వేయాలి
కొత్త రకం పంటలను జిల్లాలో పరిచయం చేయాలి కలెక్టర్ హరిచందన
నారాయణపేట టౌన్, ఫిబ్రవరి 19 : ప్రస్తుత కా లంలో సంప్రదాయ పం టలకు భిన్నంగా డిమాం డ్ ఉన్న ఇతర పంటలు వే సేలా అధికారులు రైతుల కు అవగాహన కల్పించాలని కలెక్టర్ హరిచందన సూచించారు. పట్టణంలో ని కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో వరికి బదులుగా ఎంత విస్తీర్ణంలో ఇతర పంటలు వేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే ఆ యుర్వేద పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో కొత్త రకం పంటలను పరిచయం చేయాలని, ఆదర్శ రైతును ఎంపిక చేసి ఆ రైతు పండించిన పంట వద్దకు ఇతర రైతులను తీసుకెళ్లి చూయించాలన్నారు. తదితర పంటలపై అవగాహన కల్పించి, పంట మార్పిడి చేసేలా కృషి చేయాలన్నారు. ఇతర పంటకు ప్రభుత్వం అంద జేస్తున్న సబ్సిడీని తెలియజేయాలన్నారు. అనంత రం వ్యవసాయశాఖ డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సెరా సంస్థ సభ్యురాలు సింథియాపడ ల, జిల్లా వ్యవసాయ అధికారి జాన్సుధాకర్, జి ల్లా ప్రాజెక్టు ఆఫీసర్ రామునాయక్, అరవింద్, ఉదయ్కాంత్, ఎంఏవోలు, ఏఈవోలు తదితరు లు పాల్గొన్నారు.