జడ్చర్ల, ఫిబ్రవరి 11 : బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వేరుశనగ క్వింటాకు రూ.6,591 ధర పలికింది. మార్కెట్లో విక్రయానికి వేరుశనగ, కందులు, ఆముదాలు, బబ్బెర్లు, వడ్లను రైతులు తీసుకొచ్చారు. మొత్తం 16,006 బస్తాల వేరుశనగ విక్రయానికి రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ.6,591, కనిష్ఠంగా రూ.3,009, మధ్యస్తంగా రూ.6,510 ధరలు వచ్చాయి. 172బస్తాల కందులు విక్రయానికి రాగా, క్వింటాకు గరిష్ఠంగా రూ.5,987, కనిష్ఠంగా రూ.5, 029, మధ్యస్తంగా రూ.5,889 ధర పలికింది. 2బస్తాల బబ్బెర్లు విక్రయానికి రాగా, క్వింటాకు రూ.5,869 ధర వచ్చింది. అలాగే 60 బస్తాల ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం విక్రయానికి రాగా, క్వింటాకు రూ.1,209 ధర పలికింది. 8బస్తాల ఆముదాలు విక్రయానికి రాగా, క్వింటాకు రూ.6,010 ధర వచ్చింది.