త్వరలో 18 వసతి గదులు ప్రారంభిస్తాం
క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
శ్రీవారి వనం, ఉచిత అన్నదానం ప్రారంభం
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 16 : ఎంతో చరిత్ర ఉన్న మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయా న్ని తిరుపతి స్థాయిలో అభివృద్ధి చేస్తామని క్రీడా, ప ర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. పద్మావతి అమ్మవారి ఆలయ సమీపంలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన శ్రీవారి వనాన్ని బుధవారం మంత్రి ప్రారంభించారు. అలాగే స్వామి వారి ఉచిత అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించి భక్తులకు వడ్డించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తున్న 18 వసతి గదుల పనులు త్వరలో పూర్తికానున్నాయన్నారు. ఏసీ కల్యాణ మండపం, పద్మావతి అమ్మవారి ఆల యం వద్ద షెడ్లు నిర్మించామన్నారు. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునఃనిర్మించినట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కోనేరులో తగినంత నీటిని ఉం చాలని సూచించారు. నడకదారిన వచ్చే భక్తులకు తా గునీటిని అందుబాటులో ఉంచాలన్నారు. కొండపై నుంచి కిందకు వెళ్తున్న నీటిని ఉద్యానవన తోటకు మల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా జై తెలంగాణ టీవీ ఆధ్వర్యంలో ‘మన నేతపై జన గీతం’ టైటిల్‌తో రూపొందించిన పాటను మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి విడుదల చేశారు. ఈ పాటను గాయకు డు, కవి గోరటి వెంకన్న రచించగా.. గానం ధనుంజయ, సంగీతాన్ని బోలే షావలి అందించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ మధుసూదన్, ఎండోమెంట్ అధికారి శ్రీనివాసారాజు, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, జై తెలంగాణ టీవీ సీఈవో మారుతీసాగర్, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ కారణజన్ముడు..
అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందజేస్తున్న సీఎం కేసీఆర్ కారణజన్ముడని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రా రంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మరొకరి ప్రాణాన్ని కాపాడేందుకు రక్తదానం చేసిన వారి సేవలు అభినందనీయమన్నారు. 15 మంది బాధితులకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.24,72,500 చెక్కులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, రెడ్‌క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ ఉన్నారు.
సీనియర్ సిటిజన్లకు సముచిత స్థానం..
ప్రజలకు అతి చేరువగా ఉంటున్న సీనియర్ సిటిజన్లకు సముచిత స్థానం ఉంటుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పారిశ్రామిక వాడలోని సీనియర్ సిటిజ న్ ఫోరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ వి శ్రాంత ఉద్యోగి హన్మంత్‌రెడ్డి సంతాపసభకు హాజరయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో హన్మంత్‌రెడ్డి చురుకు గా పాల్గొనే వారన్నారు. మంత్రి వెంట మున్సిపల్ చై ర్మన్ నర్సింహులు, నాయకులు బస్వరాజ్, నారాయ ణ, ఉమేశ్‌కుమార్, మోహన్‌రెడ్డి, బుచ్చన్న, నాగభూషణం, ఎల్లారెడ్డి, అనంతరెడ్డి, జయరాములు, రఘుపతిరావు, మల్లికార్జున్, శివుడు తదితరులు ఉన్నారు.
మౌలిక వసతులు కల్పించాలి..
నారాయణపేట, ఫిబ్రవరి 16 : మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు క ల్పించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. బు ధవారం శీల గార్డెన్ ఫంక్షన్హల్లో ప్రజాప్రతినిధుల కు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌కు మించి మౌలిక సదుపాయాలు కల్పించి మెరుగైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలల జాబితా అందించాలన్నారు. ఎంపీ మన్నె మాట్లాడుతూ రానున్న రోజుల్లో స్థానికంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధన అందుతుందన్నారు. జెడ్పీ చైర్పర్సన్ వనజ మాట్లాడుతూ సర్కార్ బడుల బలోపేతానికి ముఖ్యమంత్రి పూనుకున్నారన్నారు. ఎ మ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ప ట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు మనసుపెట్టి కార్యక్రమంలో పాలుపంచుకోవాలన్నా రు. సమావేశంలో కలెక్టర్ హరిచందన, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ పాల్గొన్నారు.
‘