బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి
అకస్మాత్తుగా బస్సులో చెలరేగిన మంటలు పూర్తిగా దగ్ధం
శ్రీశైలం జాతీయ రహదారిపై ఘటన
ఉప్పునుంతల, ఫిబ్రవరి 23: నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం చెన్నారం సమీపంలోని హైదరాబాద్-శ్రీశైలం ప్రధానరహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు శ్రీశైలం నుంచి సంగారెడ్డికి వెళ్తుంది. ఇదే క్రమంలో అచ్చంపేట నుంచి ఉప్పునుంతల మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన గంట సాయిబాబు(34) బైక్‌పై అచ్చంపేటకు వెళ్తూ బస్సును ఢీకొట్టాడు. ప్రమాదంలో సాయిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు.బైక్‌ను తప్పించబోయి బస్సు ఆటోను ఢీకొట్టింది. ఆటో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. బస్సును బైక్ ఢీకొట్టడంతో బస్సులో నుంచి మంటలు వ్యాపిం చి పూర్తిగా దగ్ధమైంది. బస్సు కిటికీ అద్దాలు పగులగొట్టుకొని ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెనుప్రమాదం తప్పింది. బ స్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలానికి అచ్చంపేట సీఐ అనుదీప్, ఎస్సై ప్రదీప్, ఉప్పునుంతల ఎస్సై శేఖర్‌గౌడ్ వెళ్లా రు. సాయిబాబా మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అ లుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ద వాఖానకు తరలించారు. అచ్చంపేట పోలీసులు కేసునమోదు చేశారు.