ప్రమాణాలు పెంచేందుకే ‘మన ఊరు-మన బడి’
విద్యా వ్యవస్థలో పెనుమార్పులు
ప్రజాప్రతినిధులు అమలులో కీలకంగా వ్యవహరించాలి
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : వి ద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నా రు. ఇందులో భాగంగా విద్యా ప్రమాణాలు పెం చేందుకే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో ‘మన ఊరు-మన బడి’, మన బస్తీ-మన బడి’లో భాగంగా స్థానిక ఫంక్షన్హాల్లో వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడు తూ దేశంలో వెయ్యి రెసిడెన్షియల్ పాఠశాలలు నడిపిస్తూ ప్రతిభ కలిగిన విద్యార్థులను తయారు చేసి అఖిల భారత స్థాయిలో ఆణిముత్యాలను అం దిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలక్ష భాగంగా మూడు దశ ల్లో పాఠశాలలను అభివృద్ధి చేసేలా ప్రభుత్వం కా ర్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే వనపర్తి, గద్వాల జిల్లాలో ఉన్న పాఠశాలలను మరమ్మతులు చేసేందుకు సిద్ధంగా ఉం డాలని సూచించారు. విద్యారంగానికి ఈ బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం ప్రాధాన్యాంశాల వారీగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి, సంక్షేమం చేపడుతున్నదని వెల్లడించారు. ప్రత్యేక కమిటీలు వేసి అందులో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు మెరుగైతే పే ద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భారం త గ్గుతుందన్నారు. పాఠశాలల్లో సన్నబియ్యంతో భో జనం పెట్టడంతో ప్రైవేటు పాఠశాలల వైపు చూ డడం తల్లిదండ్రులు మానేశారని తె లిపారు. ఉచితంగా విద్య అందించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు 12 రకాల విధానాలను రూపొందించినట్లు చె ప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక వి ద్యార్థులు ఉన్న 41,337 పాఠశాలలను ఎంపిక చేసి రూ.7,289 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని చెప్పా రు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వ కేటాయింపులు మాత్రమే సరిపోవ ని, పూర్వ విద్యార్థులు, ఇతర వర్గాల ద్వారా విరాళాలు సేకరించాలన్నా రు. నిర్ణీత సమయంలోగా పనులు పూర్తి చేయకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కొత్త గదు లు, విద్యుత్, మరుగుదొడ్ల నిర్మాణాలు, భవనాలకు రంగులు వేయడం, మరమ్మతులు చేయడం, ఫర్నిచర్ ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రతి జిల్లా లో 2021-22 విద్యా సంవత్సరానికి 35 శాతం పాఠశాలలను అభివృద్ధి చేస్తామని, కార్యక్రమాన్ని కలెక్టర్ పర్యవేక్షిస్తారన్నారు. ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను ముందుగా మరమ్మతులు చేయాలన్నారు. ప్రమాదం జరిగితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంద ని, ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో చాలా అన్యాయం జరిగిందన్నా రు. అంగన్వాడీ పాఠశాలలను కూడా ఇందులో చేర్చాలని కోరా రు. సమావేశంలో ఎమ్మెల్సీ కూ చకుళ్ల దామోదర్‌రెడ్డి, వనపర్తి, జోగుళాంబ గద్వాల జెడ్పీ చైర్మ న్లు లోకనాథ్‌రెడ్డి, సరిత, గ్రంథాలయాల సంస్థ జి ల్లా చైర్మన్లు లక్ష్మయ్య, కురుమూర్తి యాదవ్, డీఈవోలు రవీందర్, సిరాజ్, టీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, పెబ్బేరు మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, ఎంపీపీలు శైలజ, మౌనిక, జెడ్పీటీసీ పద్మ, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
మూడు నెలల్లో కాలువ పూర్తి కావాలి..
ఖిల్లాఘణపురం, ఫిబ్రవరి 18 : ఎంజీకేఎల్ఐ నుంచి నీటి విడుదల నిలిపివేసిన నేపథ్యంలో కా లువలపై ఉన్న స్ట్రక్చర్ల నిర్మాణాలు మూడు నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించాలని మం త్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని ఘణపురం కాలువ, షాపూర్ వద్ద నిర్మిస్తున్న వయోడెక్ట్ పనులను పరిశీలించారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ కర్నెతండా లిఫ్ట్ పనులు వెంటనే చేపట్టాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఏడాదిలోగా డిస్ట్రిబ్యూటరీ కాలువలన్నీ పూర్తి చేయాలన్నారు. ఆశించిన స్థా యిలో పనిచేయని కాంట్రాక్టర్లను తప్పించాలని సూచించారు. 0.2 టీఎంసీలతో నిర్మించనున్న మామిడిమాడ రిజర్వాయర్‌ను ప్రణాళికబద్ధంగా నిర్మించాలన్నారు. భూ సేకరణలో ఇబ్బందులు తలెత్తితే రెవెన్యూ అధికారులతో కలిసి వెంటనే పరిష్కరించాలన్నారు. ఏఈ, డీఈలను నియమించామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సామ్యనాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, నాయకులు కృష్ణయ్య, బాల్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.