ప్రజా సంక్షేమం, రాష్ర్టాభివృద్ధే లక్ష్యం
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
గోదాము నిర్మాణానికి శంకుస్థాపన
మూసాపేట, ఫిబ్రవరి 18 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో నాబార్డు సహకారంతో నిర్మించనున్న గోదాము నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ ము ఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాసంక్షేమం, రాష్ర్టాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. అన్నివర్గాల అభ్యున్నతికి దేశంలో ఎక్కడాలేని పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ప్రజా సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందరూ అండగా నిలువాలని కోరారు. అదేవిధంగా గ్రామంలో నిర్వహిస్తున్న నాభిశిల ప్రతిష్ఠాపనోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ గూపని కళావతీకొండయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, సర్పంచ్ తూము శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీ సుకన్య, నాయకులు మశ్చందర్‌నాథ్, కలీం, మల్లయ్య, బాలన్న, మధు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
బాధితుడికి పరామర్శ
మండలంలోని తిమ్మాపూర్‌కు చెందిన మనోహర్ రోడ్డు ప్రమాదంలో గాయపడి జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శుక్రవారం దవాఖానకు వెళ్లి మనోహర్‌ను పరామర్శించారు. అతడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు.