ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు
ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 23: పోలీసు సి బ్బంది సంక్షేమం ప్రధాన అంశంగా భావించి సిబ్బంది సంతోషంగా తమ విధులు నిర్వర్తించేలా కృషి చేయడం తన ప్రాథమిక బాధ్యతగా భావిస్తానని ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో సా యుధ బలగాలు, హోం గార్డులకు యూనిఫామ్ కిట్ ఆర్టికల్స్, ఉత్తమ సేవలు అందిస్తున్న సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నెలరోజులుగా జిల్లా, ఇతర ప్రాంతాల్లోని వివిధ బందోబస్తుల్లో పాల్గొన్న సిబ్బంది కృషి, క్రమ శిక్షణ ఆభినందనీయమన్నారు. జాతరల సందర్భంగా ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహించిన సిబ్బందికి లభించే ప్రశంసలు తనకు గొప్ప సంతోషాన్ని కల్గిస్తాయని తెలిపారు. అదే సమయం లో పోలీసు వృత్తిలోని ఒత్తిడిని అధిగమించేందుకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరమన్నారు. మన కుటుంబంతో బాధ్యతగా మెలగడం అదనపు బలాన్ని ఇస్తుందన్నారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటూ పొదుపు చేయడంతో ఆర్థికంగా భరోసా లభిస్తుందన్నారు. పోలీసు సిబ్బందిలోని నైపుణ్యాలు, వృత్తి నిబద్ధ్దత తనకు గర్వకారణమన్నారు. సిబ్బంది విధులు నిర్వహించడంలో ఉత్సాహంగా ఉంచడమేగాక వారి ఆరోగ్య, వ్యక్తిగత సమస్యలను కూడా గు ర్తించి పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు.
పోలీసు శాఖలోని సిబ్బంది అందరూ ఒకే కుటుంబం, హోదాలను ప్రదర్శించుకునే తీరుకు ఆతీతంగా ఉండడం మనకు అదనపు బలాన్ని ఇస్తుందన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని, కిట్ ఆర్టికల్స్‌తో పాటుగా వాటర్ బాటిళ్లను కూడా అందజేశారు. కార్యక్రమంలో సాయుధ సిబ్బంది, స్షెషల్ పార్టీ, హోంగార్డులకు ఎస్పీ కిట్ ఆర్టికల్స్ అందజేశారు. విధినిర్వహణలో ప్రతిభ కనబర్చిన 61మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. చక్కని పనితీరు కనబరిచే సిబ్బందికి కచ్చితంగా తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది యోగక్షేమాల గురించి ఎస్పీ వాకబు చేస్తూ అడిగిన విషయాలను వెంటనే పరిష్కరించారు. పిల్లల చదువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారిని పైచదువులకు పంపించే క్రమంలో సహాయం అవసరమైతే అధికారులను సంప్రదించాలని ఎస్పీ భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో ఏవో లావణ్య, ఇన్సెక్టర్లు సురేశ్ , రాజు, శ్రీనివాస్, అప్పలనాయుడు, పోలీసు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.