ప్లాస్టిక్ కవర్ల స్థానంలో బయో తొట్టీలు వాడాలి
కేటీదొడ్డి మండలం నుంచి మొదలుపెడదాం
సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్
ఉమ్మడి జిల్లాలో పర్యటన
గద్వాల, ఫిబ్రవరి 16 : నర్సరీల్లో ప్లాస్టిక్ కవర్లకు బ దులు బయోతొట్టీలను వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ సూచించారు. కేటీదొడ్డి మండలం నుంచి ప్లాస్టిక్ రహిత నర్సరీలు మొదలుపెట్టాలన్నారు. బుధవారం జోగుళాంబ గద్వాల కలెక్టరేట్ సమావేశ హాల్లో బ యోతొట్టీల తయారీపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. కేటీదొడ్డి మండలం చింతలకుంట జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రీజ తయారు చేసిన బ యోతొట్టీల గురిం చి ఓఎస్డీకి వి వరించారు. ఈ సందర్భంగా ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ వేరుశనగ పొట్టుతో బయోతొట్టి తయారు చేయడం రాష్ర్టానికే గర్వకారణమన్నారు. శ్రీజ తయారు చేసిన బయో తొట్టీలతో పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు.
రాష్ట్రంలో ముందుగా కేటీదొడ్డి మండలంలోనే బయో తొట్టీలు ఏర్పా టు చేసి మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఇన్నేవేషన్ ప్రతినిధులకు ఆదేశించారు. మండలంలో బయోతొట్టీల తయారీకి స్థలం, నీటి వసతి, విద్యుత్ సదుపాయం క ల్పించాలన్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని అని నర్సరీల్లో పాస్టిక్ కవర్లకు బదులుగా తొట్టీలు వాడనున్నట్లు చెప్పారు. శ్రీజకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం నర్సరీల నిర్వహణపై ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొక్కలను సంరక్షించినందుకు అధికారులను అభినందించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీహర్ష, అధికారులు క్షితిజా, రా మకృష్ణ, దేవరాజు, డీఆర్డీవో ఉమాదేవి, డీపీవో శ్యాంసుందర్, గైడ్ టీచర్ ఆగస్టీన్, చీఫ్ ఇన్నోవేషన్ అధికారి శాంతతాటం, ప్రతినిధులు విజయ, ధృతి, ఫిరోజ్ అహ్మద్ ఉన్నారు.
మొక్కలను సంరక్షించాలి..
కొత్తకోట/పెద్దమందడి/పెబ్బేరు రూరల్/జడ్చర్ల టౌన్/బాలానగర్, ఫిబ్రవరి 16 : నర్సరీలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ సూచించారు. బుధవారం ఆయా మండలాల్లోని కనిమెట్ట, పాలెం, వెల్టూరు, తోమాలపల్లి, బాలానగర్ గ్రామాల్లో హై వే వెంట నాటిన మొక్కలు, పాలెంలో నర్సరీని పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సరీలో మొక్క లు ఎండిపోకుండా నిత్యం నీటిని అందించాలన్నారు. మొ క్కలను సంరక్షించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎండిన మొక్కల స్థానంలో కొత్తవి నాటాలన్నా రు. ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలన్నారు. హైవేపై ఉన్న ప్లాంటేషన్ నర్సరీల్లో కలుపు మొక్కలు లేకుండా తొలగించాలన్నారు. రహదారిపై మొక్కలు, పూలమొక్కలు వేర్వేరు గా ఏర్పాటు చేయాలన్నారు.
మరో రెండు నెలలు మొక్కల ను సంరక్షిస్తే పూర్తిగా ఎదుగుతాయన్నారు. వెల్టూర్ గ్రామం లో మొక్కలను సంరక్షిస్తున్న సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ సిబ్బందిని అభినందించారు. వేసవిలో మొక్కలు ఎండిపోకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని అందజేయాలని సూచించారు. జడ్చర్ల ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ప్లాంటేషన్‌ను పరిశీలించి మొక్కల సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు ఆశిష్ సంగ్వాన్, తేజస్‌నందలాల్ పవార్, కొత్తకోట ఎంపీపీ మౌనిక, డీఆర్డీవో నర్సింహులు, ఎంపీడీవో శ్రీపాదు, ఏపీవో రాములు, పెబ్బేరు ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ సునిత, అధికారులు ఉన్నారు.