నారాయణపేట టౌన్, ఆగస్టు 7 : చేనేత కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హరిచందన అ న్నారు. శనివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని జౌళి శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌ రస్తా వద్ద ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మా ట్లాడుతూ చేనేత చీరలకు పేట జిల్లా పెట్టింది పేరని, ఇ క్కడ నేసిన చీరలకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందని పే ర్కొన్నారు. సిరిసిల్ల తర్వాత పేటలో ఉత్పత్తి కేంద్రం, మార్కెటింగ్ సౌకర్యం, ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. చేనేత కార్మికులు ముద్ర పథకం ద్వారా రుణాలు తీసుకొని వ్యాపారం చేసుకోవాలన్నారు. చేనే త కార్మికులు శ్రీనిధి పథకం ద్వారా సొంతంగా మగ్గా లు పెట్టుకోవచ్చని, స్థలం లేని వారు కో ఆపరేటివ్ సం ఘంగా ఏర్పడి మగ్గాలను ఏర్పాటు చేసుకోవాలని ఆమె చెప్పారు. కార్మికులు నాణ్యమైన చీరలు నేసేందు కు సంబంధిత అధికారుల సలహాలు తీసుకోవాలన్నా రు. ముద్ర పథకం ద్వారా చేనే త కార్మికులకు మంజూరైన రు ణాలకు సంబంధించిన చెక్కు ను వారికి అందజేశారు. అనంతరం చేనేత కార్మికులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అనసూ య, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్డీవో గోపాల్‌నాయక్, డీఈవో లియాఖత్ అలీ, జిల్లా చేనేత జౌళి అభివృద్ధి శాఖ అధికారి చంద్రశేఖర్, చేనేత కార్మికులు పాల్గొన్నారు.
జిల్లా గ్రీన్ వన్ చాంపియన్ అవార్డుకు ఎంపికైన కళాశాల
మహాత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యాశాఖ, విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థా యిలో మొక్కలు నాటడం వాటి పెంపకంపై పట్టణంలోని చిట్టెం నర్సిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జిల్లా గ్రీన్ వన్ చాంపియన్ అవార్డుకు ఎంపికైంది. శనివారం కలెక్టర్ కార్యాలయంలో కళాశాల ప్రిన్సిపాల్ మెర్సీ వ సంత కలెక్టర్ హరిచందన నుంచి అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కళాశాలలో పారిశుధ్యం, పరిశుభ్రత, నీరు, శక్తి, వ్యర్థాల నిర్వహ ణ, పచ్చదనం వంటి స్వచ్ఛత, ఉత్తమ అభ్యాసాలను అమలు చేసినందుకుగానూ ఈ అవార్డుకు ఎంపికైందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు పొందేలా ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, విద్యార్థులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రో గ్రాం అధికారులు పాల్గొన్నారు.