ఎమ్మెల్యే అబ్రహం
వల్లూర్‌లో పప్పుశనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఇటిక్యాల, ఫిబ్రవరి18: ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను విక్రయించుకునేందుకుగానూ రైతులు దళారులను నమ్మి మోసపోవొద్దని, తెలంగాణ ప్రభుత్వం అండగా ఉన్నదని ఎమ్మెల్యే అబ్రహం సూచించారు. మండలంలోని వల్లూర్‌లో ఏర్పాటు చేసిన పప్పుశనగ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. రైతులు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.5లక్షల రైతుబీమా అందజేస్తూ ఆకుటుంబాన్ని ఆదుకుంటుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీసీఎస్ చైర్మన్ రంగారెడ్డి మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రానికి పప్పుశనగలు తెచ్చేటప్పుడు 12శాతం తేమ ఉండేలా చూసుకొని నాణ్యత కలిగిన శనగలను తీసుకురావాలన్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.5,230 ఉందన్నారు. అనంతరం మండలంలోని చాగాపురం గ్రామానికి చెందిన హరిజన్ ప్రభుదాస్ ప్రమాదవశాత్తు మృతిచెందగా.. రూ.5లక్షల ప్రమాదబీమా చెక్కును ఆయన భార్య తిమ్ములమ్మకు ఎమ్మెల్యే అందజేశారు. అలాగే షాబాదా నుంచి శెనిగపల్లె వరకు రూ.2కోట్ల 10లక్షల(ఎస్డీఎఫ్ నిధులు)తో నిర్మించే బీటీరోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. కార్యక్రమంలో అలంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాందేవ్‌రెడ్డి, సర్పంచులు రవీందర్‌రెడ్డి, సుంకన్న, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గిడ్డారెడ్డి, నాయకులు సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి అయూబ్ తదితరులు పాల్గొన్నారు.