మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు
హాజరైనడీసీసీబీ చైర్మన్ నిజాంపాషా,జెడ్పీచైర్‌పర్సన్ వనజ
ఎమ్మెల్యే చిట్టెం ఆధ్వర్యంలో అన్నదానం
మక్తల్ టౌన్, ఫిబ్రవరి 16: తెలంగాణ ప్రజల ముద్దుబిడ్డ,తెలంగాణ రాష్ర్టానికి దిక్సూచి సీఎం కేసీఆర్ అని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవా రం మక్తల్ పట్టణంలో సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవాకార్యక్రమంలో భాగంగా మక్తల్ మార్కెట్ యార్డు ఆవరణలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే చిట్టెం ప్రారంభించారు.ఈ శిబిరంలో దాదాపు రెండు వందలమంది టీఆర్ఎస్ కార్యకర్తలు రక్తదానం చేశారు. అనంతరం మక్తల్ బస్టాండ్ ఆవరణలో దాదాపు మూడువేల మందికి అన్నదానం చేశారు. ఎమ్మెల్యే చిట్టెం ప్రజలకు భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవం సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమ అదృష్టమన్నారు. టీఆర్ఎస్ను స్థా పించి 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ అభివృద్ధ్ది కోసం తపన పడుతున్నారని తెలిపారు.
నియోజకవర్గంలో వలసలను నిలిపి నియోజకవర్గ ప్రజలకు రెండు పంటలు పండించే విధంగా సాగునీటి వసతి కల్పించి రైతులకు పెటుబడి సాయం అందించి రైతుల గుండెల్లో నిలిచిన దేవుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నా చివరి రక్తపుబొట్టు వరకు కృషి చేస్తానన్నారు. త్వరలో నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీకాలేజీ ఏర్పాటు చేస్తానన్నారు. అగ్నిమాపక కేంద్రానికి సీఎం కేసీఆర్ నిధు లు విడుదల చేశారన్నారు. కా ర్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, జెడ్పీచైర్‌పర్సన్ వనజ, మక్తల్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహగౌడ్, మాగనూర్ జెడ్పీటీసీ వెంకటయ్య,మాగనూర్ మండల అద్యక్షుడు ఎల్లారెడ్డి, క్రిష్ణ అధ్యక్షుడు ఆనంద్‌పాటిల్, మార్కెట్ వైస్ చైర్మన్ అనిల్, కౌన్సిలర్లు జగ్గలి రాములు,మొగిలప్ప, అన్వర్,శంషొద్దీన్, ఊట్కూర్ సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, మాద్వార్ వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకులు శేఖర్‌రెడ్డి, కోళ్ల వెంకటేశ్, శ్రీహరి, తాయప్ప, కావలి ఆంజనేయులు, కృష్ణయ్య, నియోజకవర్గ అధికార ప్రతినిధి రామలింగం, నేతాజీరెడ్డి, ఈశ్వర్ యాద వ్, సాగర్, సాధిక్, బండారి ఆనంద్ తదితరులు నియోజకవర్గ టీఆర్ఎస్ ఎంపీటీసీలు, సర్పంచులు, చిట్టెం అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఊట్కూర్‌లో పండ్లు, బ్రెడ్డు పంపిణీ
ఊట్కూర్, ఫిబ్రవరి16 : సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాలను బుధవారం మండలకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ప్రభు త్వ దవాఖానాలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సీఎం నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్, యువజన విభాగం మండల అధ్యక్షుడు ఆనంద్‌రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రహిమాన్, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి జమీర్, మోహన్‌రెడ్డి, నర్సింహరాజ్గౌడ్, ఖాలిక్, రమేశ్, రాజు పాల్గొన్నారు.
ధన్వాడలో..
ధన్వాడ,ఫిబ్రవరి 16: ధన్వాడలో బుధవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ధన్వాడ మండలానికి చెందిన పార్టీ నాయకులు చంద్రశేఖర్, గౌని శ్రీనివాసులు, సచిన్, నారాయణస్వామి తదితరులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, సర్పంచ్ చిట్టెం అమరేందర్‌రెడ్డి, మార్కెట్ యార్డు డైరెక్టర్ శివారెడ్డి, నీరటి నర్సింహులునాయుడు తదితరులు పాల్గ్గొన్నారు.
రక్తదాన శిబిరంలో పాల్గొన్నఎమ్మెల్యే పట్నం
కోస్గి, ఫిబ్రవరి16: ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా బుధవారం ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏబీకే ఫంక్షన్హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యకర్తలు నాయకులు రక్తదానం చేశారు. అంతకుముందు జిల్లా గ్రంథాలయాల సంస ్థచైర్మన్ రామకృష్ణ సంపల్లి పాఠశాలలో విద్యార్థులకు నోటుపుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి పీఏసీసీఎస్చైర్మన్ భీంరెడ్డి, జెట్పీటీసీ ప్రకాష్‌రెడ్డి, కౌన్సిలర్లు మాస్ట్టర్శ్రీనివాస్, బాలేశ్, జనార్దన్,బందెప్ప ఓంప్రకాష్, నాయకులు రాజేశ్ తదితరులున్నారు.