ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు
త్వరలో హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై నీరాకేఫ్
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
వనపర్తిలో ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖ అధికారులతో సమీక్ష
వనపర్తి, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : గుడుంబా, గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ముం దుకు సాగుదామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. జి ల్లా కేంద్రంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గడ్, ఒడిశా రాష్ర్టాల సరిహద్దు ప్రాం తాల నుంచి తెలంగాణకు గంజాయి అక్రమ ర వాణా జరగుతున్నదన్నారు. గంజాయిని రవా ణా చేసే వారితోపాటు సహకరిస్తున్న నాయకు లు, వ్యక్తులపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. గంజాయి సాగుచేసే వారికి రైతుబంధు రద్దు చేస్తామన్నారు. పోలీసుల సమన్వయంతో ఎక్సైజ్ శాఖ అధికారులు గంజా యి సాగు, వినియోగాన్ని అరికట్టాలని సూ చించారు. గుడుంబా నిర్మూలనలో భాగంగా వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు 256 మందికి పునరావాసం పథకం కింద బీసీ, ఎస్సీ కా ర్పొరేషన్ల రుణాలు ఇచ్చామన్నారు. అన్ని వ ర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కార్ పని చేస్తున్నదన్నారు. గీతా కార్మికులకు చెట్టు పన్ను రద్దు చేశామన్నారు. నీరా పాలసీలో భాగంగా భువనగిరి జిల్లా నందనం గ్రామం లో పైలెట్ ప్రాజెక్టు చేపట్టామన్నారు. త్వర లో హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై రూ.12 కోట్లతో నీరా కేఫ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి ఉమ్మడి జి ల్లాను అభివృద్ధి చేస్తున్నామన్నారు. వనపర్తి జి ల్లాలో గిరికతాళ్లు నాటనున్నట్లు చెప్పారు. ఇం దుకోసం చెట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, ము న్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్, ఉమ్మడి జిల్లా సహా య కమిషనర్ దత్తరాజుగౌడ్, ఇన్చార్జి ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ సైదులు, వనపర్తి ఎక్సైజ్ సీఐ సుభాశ్ తదితరులున్నారు.