మంత్రి నిరంజన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 16: కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో ఆశ కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ క్యాంపు కార్యాలయంలో నియోజకవ ర్గంలోని ఐదు మండలాల్లో పనిచేస్తున్న 263 మంది ఆశ వర్కర్లకు ప్రభుత్వం నుంచి మంజూరైన సాంసంగ్ 4జి స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొవిడ్ నియంత్రణలో ఆశలు గ్రామాల్లో ముఖ్యపాత్ర పోషించారని, అందరిలో అవగాహన కల్పించారని ప్రశంసించారు. స్మార్ట్ ఫోన్ల వల్ల గర్భిణుల ఆరోగ్య సమాచారాన్ని అక్కడికక్కడే ఆన్లైన్లో నమోదు చేసే వీలు ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ ఫోన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆశవర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం అందించే రెండు జతల యూనిఫాంను సకాలంలో అందించేలా వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌తో మాట్లాడి అందేవిధంగా చేస్తానని హామీ ఇచ్చారు. వస్త్ర వ్యాపారి అయిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆశవర్కర్లకు యూనిఫామ్ జతలు అందించాలని సూచించారు. అంతకుముందు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ఆశ కార్యకర్తలు కరోనా నియంత్రణకోసం ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేయడం వల్లనే కరోనా నియంత్రణలోకి వచ్చిందన్నారు. ఆశ వర్కర్లు సేవా దృక్పథంతో పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, జెడ్పీచైర్‌పర్సన్ పెద్దపల్లి పద్మావతి, కలెక్టర్ ఉదయ్‌కుమార్, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, డీఎంహెచ్‌వో సుధాకర్లాల్, ఇమ్యూనైజేషన్ అధికారి సాయినాథ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కల్పన, వైస్ చైర్మన్ బాబురావు పాల్గొన్నారు.
మంత్రికి వినతుల వెల్లువ
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 16: ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ నాగర్‌కర్నూల్ జిల్లా సెర్ఫ్ ఉద్యోగులు బుధవారం మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈనెల 17 సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4086 మంది సెర్ఫ్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తూ తీపికబురు చెప్పాలని కోరారు. అలాగే దళిత బంధు పథకంలో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలని ఎన్పీఆర్డీ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి ఎన్పీఆర్డీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఆయా కార్యక్ర మంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, వికలాంగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి బాలీశ్వర్, సహాయ కార్యదర్శి కుర్మయ్య, సభ్యులు అంజి, మహేశ్, మల్లయ్య, లింగంగౌడ్, సెర్ఫ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు నిరంజన్, యాదగిరి, నరసింహ, వెంకటేశ్, ప్రభాకర్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.