ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
మూసాపేట, ఫిబ్రవరి 16: సీఎం కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని బుధవారం మండలంలోని సంకలమద్ది శివారులోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో కలిసి సామూహిక భోజనాలు చేశారు. అదేవిధంగా విద్యార్థులకు పండ్లు, నోట్‌బుక్స్ పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో నూతన ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరు అందిస్తుండటం వల్ల వ్యవసాయ ఆధారిత కుటుంబాలన్నీ ఆర్థికంగా లాభపడినట్లు చెప్పారు. రైతు సంక్షేమ పథకాలను అమలుచేసి ఆత్మహత్యలు లేకుండా చేశారన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నందునే అన్ని రంగాల్లో ప్రతి పల్లెను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా కస్తూర్బా పాఠశాలలోని సమస్యలను ప్రిన్సిపాల్ మంజుల ఎమ్మెల్యే ఆల దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి నివేదిక ఇవ్వాలని చెప్పారు. తనవంతు సహకారం అందిస్తానన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ కళావతికొండయ్య, పార్టీ మండలాధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, సర్పంచులు స్వరూప, శ్రీనివాసులు, రఘుపతిరెడ్డి, శివరాములు, ఆంజనేయులు, మల్లయ్య, కోట్ల రవి, రఘురాములు, నాయకులు, కార్యకర్తలు, తాసిల్దార్ మంజుల, ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీవో సరోజ పాల్గొన్నారు.
రోడ్లు సౌకర్యం ఉంటేనే అభివృద్ధి
భూత్పూర్, ఫిబ్రవరి 16: గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉంటేనే అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అన్నాసాగర్ నుంచి హస్నాపూర్ వరకు 8 కిలోమీటర్ల మేర బీటీరోడ్డు మంజూరు కానున్నట్లు ఎమ్మెల్యే ఆల తెలిపారు. మండల నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే రోడ్డును పరిశీలించారు. రోడ్డు పనులు జరుగుతున్నందన కొంతమంది రైతుల పొలాలు పోవచ్చు కానీ పొలాలకు మంచి డిమాండ్ వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఏఈ అభిషేక్, మండల కో ఆప్షన్ సభ్యుడు ఖాజా, నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, సత్యనారాయణ, ఆల శశివర్ధన్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, నర్సిరెడ్డి, నర్సింహులు, అంజిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, షాకీర్ పాల్గొన్నారు.