డీపీహెచ్‌వో రవిశంకర్
పీహెచ్‌సీల్లో ఆశ కార్యకర్తలకు స్మార్ట్ఫోన్లు పంపిణీ
వనపర్తి రూరల్, ఫిబ్రవరి 18: జిల్లాలోని ఆశ కార్యకర్తల సేవ లు అద్భుతమని డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని కడుకుం ట్ల పీహెచ్సీలో ఆశ వర్కర్లకు ఎంపీపీ కిచ్చారెడ్డితో కలిసి స్మార్ట్ఫోన్లను అందజేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 50మంది ఆశవర్కర్లు ప్రజారోగ్య సంరక్షణలో నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఆరోగ్యశాఖ ఇచ్చిన సిమ్‌కార్డు నిత్యం ఆన్‌లో ఉంచాలని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ హరిత, ఉపసర్పంచ్ రాంరెడ్డి, మండల వైద్యుడు రాకేశ్‌రెడ్డి, యునాని వైద్యుడు ఎక్బాల్, టీఆర్ఎస్ గ్రామ నాయకుడు బాలకృష్ణ, మండలంలోని ఆశవర్కుర్లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
‘ఆశ’లకు స్మార్ట్ఫోన్లు పంపిణీ
గోపాల్పేట్, ఫిబ్రవరి 18: మండలంలోని ఆయా గ్రామాలకు ఆశ కార్యకర్తలకు పీహెచ్సీలో ఎంపీపీ సంధ్య, జెడ్పీటీసీ భార్గవి శుక్రవారం స్మార్ట్ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి మంజుల మాట్లాడుతూ గ్రామాల్లో గర్భిణులు, ప్రజల ఆరోగ్య సమాచారం అన్లైన్లో నమోదు చేసేందుకు ఫోన్లు ఉపయోగపడుతాయన్నారు. ప్రజలకు మైరుగైన సేవలు అందించేందుకు సులభతరం అవుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రశేఖర్, సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ కేతమ్మ, కోఆప్షన్ సభ్యుడు మతీన్, వైద్యసిబ్బంది సురేశ్‌కుమార్, వజ్రమ్మ, సుచిత్ర, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.