మన ఊరు-మన బడి’లో ఎన్నారైలు, పూర్వ విద్యార్థులు పాలుపంచుకోవాలి
శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను తొలగించాలి
ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంతో అందనున్న బోధన
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 16 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మనబడి’లో పూ ర్వ విద్యార్థులు, ఎన్నారైలు భాగస్వాములు కావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రె డ్డి పిలుపునిచ్చారు. మన ఊరు-మన బడి, మన బస్తి-మన బడి కార్యక్రమంపై బుధవారం స్థానిక సాయి గార్డెన్స్‌లో కలెక్టర్ ఉదయ్‌కుమార్ అధ్యక్షత న సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుపై అనేక అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి నుంచి.. దేశంలోనే రోల్ మోడల్ రాష్ట్రంగా రూపాంతరం చెందామన్నారు. భారీ ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్ప న, వ్యవసాయం, సంక్షేమం వంటి రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ప్రాథమిక పాఠశాల మొదలుకొని మహిళలకు ప్రత్యేక డిగ్రీ కా లేజీల వరకు నూతనంగా వందలాది విద్యా సంస్థలను ఏర్పాటు చేశామన్నారు. సర్కారు బడులను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. మన ఊరు-మన బడిలో భా గంగా రూ.7,289 కోట్లతో సుమారు 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించనున్నమన్నారు.
ప్రభుత్వ కార్యక్రమంలా భావించకుండా అందరూ భాగస్వాములు కావాల ని పిలుపునిచ్చారు. ఇతర దేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు చేయూతనందించేలా క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నా రు. పాఠశాల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకా లు, జీవోను సర్పంచులు, విద్యాకమిటీ చైర్మన్లకు అర్థమయ్యేలా తెలుగులో అనువదించాలని డీఈవోకు ఆదేశించారు. రెండో విడుతలో అదనపు గదు ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలల తొలగింపు అనుమతుల్లో జాప్యం లేకుండా కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఉత్తర్వులు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించారు. చారిత్రక కార్యక్రమంగా భా వించి ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలని సూచించారు. రానున్న రోజుల్లో ఆంగ్ల మా ధ్యమ బోధనతోపాటు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సర్కార్ బడుల్లో విద్య అందుతుందన్నా రు. ఆ దిశగా ఐటీ, విద్యా శాఖ ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. అనంతరం విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ప్రమాణాలతో ఉండేలా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అత్యధిక సమస్యలు ఉన్న పాఠశాలలను ఎంపిక చేయాలని సూచించారు.
సీఎం కేసీఆర్ పుట్టినరోజును తెలంగాణ రైతు దినోత్సవంగా ప్రకటించాలని మంత్రి నిరంజన్‌రెడ్డిని కోరారు. జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి మాట్లాడుతూ మన ఊరు-మన బడిని యజ్ఞంలా చేపట్టాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పల్లెప్రగతి మాదిరిగా విజయవంతం చేయాలన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ పనులను నాణ్యతతో చేపట్టాలన్నారు. ఎంపిక చేసిన పాఠశాలలను స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న వాటిని తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కొల్లాపూర్, కోడేరు మండలాల్లో శిథిలావస్థలో ఉన్న పా ఠశాలలను ఎంపిక చేయలేదన్నారు. నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 290 పాఠశాలలను ఎంపిక చేశామని, ప్రభుత్వ ఆ దేశాలకు అనుగుణంగా మంత్రి సూచనల మేరకు 90 రోజుల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. వచ్చే వి ద్యా సంవత్సరానికి పాఠశాలలను అందంగా తీర్చిదిద్దుతామన్నారు. అన్ని పాఠశాలల్లో మూత్రశాలలు నిర్మించాలని కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్‌ప్రసాద్ కోరా రు. మధ్యాహ్న భోజన పథకంలో గుడ్లను సరిపడా అందించేలా చర్యలు చేపట్టాలని పదర జెడ్పీటీసీ రాంబాబు కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మనూచౌదరి, రాజేశ్‌కుమార్, డీఈవో గోవిందరాజులు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే మానవతావాది..
కల్వకుర్తి, ఫిబ్రవరి 16 : ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే మానవతావాది సీఎం కేసీఆర్ అని మం త్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో భాగంగా బుధవారం టీఆర్ఎస్, రెడ్‌క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సీఎం 68వ పుట్టిన రోజు సందర్భంగా 68 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్యం, సింగిల్‌విండో చైర్మన్ జనార్దన్‌రెడ్డి, జెడ్పీటీసీలు భరత్‌ప్రసాద్, విజితారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలయ్య, వైస్ చైర్మన్ విజయ్‌గౌడ్, వైస్ ఎంపీపీ గోవర్ధన్, నాయకులు గణేశ్, మధు, వెంకటేశ్, శివరాం, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.