మహమ్మదాబాద్, ఏప్రిల్ 01 : ప్రభుత్వం అందుబాటులోని భూములను అమ్ముకుంటూ వెళ్లడమంటే భవిష్యత్ తరాలను అంధకారంలోకి నెట్టివేయడమేనని ఎస్ఎఫ్ఐ మహబూబ్‌నగర్ జిల్లా కమిటీ మహమ్మదాబాద్ మండల కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి అన్నారు. హెచ్‌సీయూ ఆందోళన నేపథ్యంలో మంగళవారం జూలపల్లిలో పోలీసులు ఆయనను ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. అరెస్టులకు భయపడేది లేదన్నారు. హెచ్‌సీయూ 400 ఎకరాల భూమి అమ్మకంపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. ప్రజల ఆస్తులను తెగనమ్ముతూ భవిష్యత్‌ను అంధకారంలోకి తోసేస్తుందని ఆయన విమర్శించారు.