ఆత్మకూరు, ఆగస్టు 3 : ‘స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా.. కడదాక నీడలాగా నిను వీడి పోదురా..’ అని ఓ సినీ కవి అన్నట్లు స్నేహబం ధం ఎప్పటికీ మనతోనే ఉంటూ మన జీవితంలో భాగమవుతుంది. ఆపదలో ఆదుకుంటూ.. కష్టా ల్లో పక్కనుంటూ.. ఎదుగుదలలో తోడుంటూ.. ఇలా రక్తసంబంధం చేయలేనిది స్నేహబంధం చే స్తుంది. మనం విజయం సాధించినప్పుడు చప్ప ట్లు కొట్టేవాళ్లు.. విషాదంలో ఉన్నప్పుడు ఓదార్చేవాళ్లు నలుగురు లేని జీవితాన్ని ఎవరూ ఊహించలేరు. అందుకే మనుషులందరికీ ఒక పేరున్న ట్లు అందరినీ దగ్గరకు చేర్చేది మాత్రం స్నేహబంధమే. నేటి రోజుల్లో స్నేహబంధం కమర్షియల్గా మారిపోతుంది. ముక్కుపచ్చలారని వయస్సు లో.. పాఠశాల స్థాయిలో.. టీనేజీ వయస్సులో ఏ వయస్సులోనైనా మంచిగా ఆలోచించే స్నేహం, చెడును ఆశించే స్నేహాలు ఎదురైతున్నాయి.
మన కోసం మనం ఎంపిక చేసుకునే అద్భుత బంధమే స్నేహబంధం. తల్లిదండ్రులు జన్మను.. తోబుట్టువులను ఇస్తే.. స్నేహితులను మాత్రం మన అభిరుచికి తగట్లు మనమే ఎంచుకునే అవకాశం ఉం టుంది. అందుకే మనకు మంచి స్నేహితులు ఎవ రు, నయవంచన చేసే వారెవరో గుర్తుపట్టి ఫ్రెండ్షిప్ చేసే పరిస్థితులొచ్చాయి. స్నేహితుల దినోత్సవం రోజున ఫేస్బుక్లో, వాట్సాప్ గ్రూపుల్లో ఫ్రెండ్షిప్ అంటే అది, ఫ్రెండ్షిప్ అం టే ఇది అంటూ పెద్దపెద్ద కొటేషన్లు పెట్టి ఊదరగొట్టడం స్నేహం కాదు. ఎదురుపడ్డ స్నేహితున్ని మనస్ఫూర్తిగా పలకరించే గుణం లేనివాడు స్నేహితుడు కాలేడు. మంచిని గుర్తించి.. చెడును దూరం పెట్టి ఆలోచిస్తేనే స్నేహం దక్కుతుంది.
భూప్రపంచంలో ఎన్ని బంధాలు ఉన్నా స్నే హానికున్న స్థానం ప్రత్యేకమైనది. అన్నా, చెల్లి, అ క్కా, తమ్ముడు, అమ్మ, నాన్న, అత్త, మామ, బా వ, బావమరిది, భార్య, భర్త, ప్రియురాలు, ప్రి యుడు ఇలా ఏ బంధాన్ని తీసుకున్నా స్నేహితుడి బంధం అత్యంత గొప్పగా నిర్వచిస్తారు. ప్రతి బం ధానికి స్నేహంతో ముడిపడి ఉంటుంది. ఆ మా టకొస్తే పురాణాల నుంచి స్నేహమనేది ప్రత్యేక గాథలను సంతరించుకుంది. ఇంతటి గొప్ప అనిర్వచనీయ బంధమైన స్నేహబంధం నేటి ఆధునిక రోజుల్లో తీరు మార్చుకుంటుంది. ఆరోగ్యకర స్నేహం మాయమై స్వార్థ పూరిత స్నేహం పుంత లు తొక్కుతుంది. అవసరాల కోసం, ఆశల కో సం, పనికోసం, పగ కోసం, డబ్బుకోసం, దర్పంకోసం ఇలా ఎవరి లక్ష్యం వారిది. మరో భిన్నకో ణం ఏమిటంటే స్నేహితుడి ఎదుగుదలను ఓర్వలేని స్నేహితులూ ఉన్నారు.
పదిమందిలో మంచి పేరు వచ్చినా, ఏదైనా సాధించినా, పనికొచ్చే పని ఏది చేసినా తప్పును వెతికి మరీ తిప్పలు పెడతా రు. తాను చేస్తున్నదే సరైందంటూ, అవతలి వారి ని అవమానించడమే లక్ష్యంగా పేచీలు పెట్టుకుంటారు. అది ఏ వయస్సులోని స్నేహంలోనైనా మంచిని చేసే స్నేహితులకన్నా మాయమాటలు చెప్పి ముంచే స్నేహితులే ఎక్కువయ్యారు. లింగభేదం లేకుండా అందరూ కమర్షియల్ స్నేహానికే ఎక్కువ విలువనిస్తున్నారు. శ్రీకృష్ణుడు కుచేలు డు, దుర్యోధనుడు కర్ణుడిలా స్నేహ మాధుర్యం అస్వాదించే స్నేహితులు కరువయ్యారు.
మనస్ఫూర్తిగా చేసే స్నేహం మాయమైపోతున్న ఈ రోజుల్లో దిల్సే దోస్తానా చేసే స్నేహితులు కూడా ఉన్నారు. సుఖంలో ఉన్నప్పుడు పలకరించకపోయినా పర్వాలేదు, కష్టంలో ఉన్నప్పుడు ఫోన్ చేసినా చాలు రెక్కలు కట్టుకొని వాలిపోయే ఆప్తమిత్రులు ఉన్నారు. చిన్ననాటి స్నేహితుడు కాని, తోటి స్నేహితుడు కాని ఏ వయస్సులో చిగురించిన స్నేహమైనా దిల్సే దోస్తానా అంటేనే ప్రాణమిచ్చేలా ప్రేమిస్తారు. స్నేహితుడికి ఏ కష్టమొచ్చినా నేను ఉన్నానంటూ భరోసానిస్తూ అన్ని విధాలుగా ఆదుకునే ప్రాణస్నేహితులు ఎందరో ఉన్నారు. మంచికి, చెడుకు, పెళ్లిళ్లకు, పేరంటాలకు కుటుంబాలతో కలివిడిగా కలుస్తూ ఆనందంగా గడుపుతూ కుటుంబాల్లోనూ ఆహ్లాదకరమైన స్నేహాన్ని నెలకొలిపే నిజమైన స్నేహితులూ ఉన్నారు. ఇలాంటి వారు చేస్తున్న ఆరోగ్యకరమైన స్నేహం మూలంగానే ఇంకా నిజాయితీగల స్నేహితులు జీవన స్రవంతిలో మెలుగుతున్నారు.