వెల్దండ : ప్రైవేట్‌కు దీటుగా నాణ్యమైన విద్యను అందించాలన్నదే తమ లక్ష్యమని వెల్దండ బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం సుగుణ అన్నారు. గురువారం పాఠశాలలో నూతనంగా అడ్మిషన్ పొందిన 20 మంది విద్యార్థులకు వెల్కమ్ ( Freshers Day ) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంస్కృత కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేందర్ రెడ్డి, మురళీమోహన్ రావు , విజయ, లావణ్య, రామేశ్వరమ్మ, లక్ష్మీ, సుహాసిని, అనిత, సిబ్బంది మహేశ్వరి తదితరులు ఉన్నారు.