జహీరాబాద్, అక్టోబర్ 7: బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్‌పూర్‌లో చోటుచేసుకుంది. హద్నూర్ పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. మండలంలోని గణేశ్‌పూర్‌కు చెందిన గునెల్లి సిద్రామప్ప(71), అతడి అల్లుడు జగన్నాథ్(42), కూతురు రేణుక(36), మనుమడు వినయ్‌కుమార్ (15) కలిసి సోమవారం పొలానికి వెళ్లారు. సాయంత్రం అందరూ కలిసి బైక్‌పై (కేఏ38ఎల్8456) ఇంటికి వస్తున్నారు. ఇంటికి చేరుఎకునే క్రమంలో బీదర్-జహీరాబాద్ ప్రధాన రోడ్డు మార్గంలో ఎదురుగా జహీరాబాద్ నుంచి బీదర్‌కు వెళ్తున్న కర్ణాటకకు చెం దిన బస్సు(కేఏ38ఎఫ్1155) బైక్‌ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో సిద్రామప్ప అక్కడికక్కడే మృతి చెందగా, జగన్నాథ్, అతడి భా ర్య రేణుక, కుమారుడు వినయ్‌కుమార్‌ను చికిత్స కోసం బీదర్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెం దడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. సిద్రామప్పకు ఇద్దరు భార్యలు ఉన్నారు. అయితే ఆయనకు రేణుక ఒక్కరే కూతురు కావడంతో గ్రామానికి చెందిన బీరదార్ జగన్నాథ్‌ను ఇల్లరికం తీసుకువచ్చారు. జగన్నాథ్, రేణక దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.
జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, రూర ల్ సీఐ హనుమంతు, హద్నూర్ ఎస్సై రా మానాయుడు బీదర్, జహీరాబాద్ ప్రభు త్వ దవాఖానలను సందర్శించారు. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.