దామరగిద్ద, జనవరి 26 : మండలంలోని బాపన్పల్లి శివాలయ విగ్రహ ప్రతిష్ఠాపనకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె నివాసంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ ఆదివారం కలిసి ఆహ్వానించారు.
ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించనున్న ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానపత్రిక అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుభాష్, యువకులు గంగాధర్, సంతోష్, రాములు, అం జి, హన్మంతు, రంగయ్యగౌడ్ ఉన్నారు.