కొత్తకోట : పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం (Ayyappa temple) ఆలయ నిర్మాణానికి కొత్తకోట మండలం అమడబాకుల మాజీ సర్పంచ్ గజ్జల అనురాధ ,గజ్జల శ్యామ్ సుందర్ గౌడ్ దంపతులు, కుమారులు గజ్జల కేశవ సాయి కృష్ణ గౌడ్ , డాక్టర్ శరత్ చంద్ర గౌడ్ భారీ విరాళాన్ని ( Donations ) అందజేశారు. ఈ సందర్భంగా రూ. 2,51,116 ను విరాళాన్ని అయ్యప్ప సేవా సమితి సభ్యులకు అందజేశారు.
అనంతరం అంబత్రాయ క్షేత్ర పీఠాధిపతి ఆదిత్య పరాశ్రీ స్వామి దాతలను అభినందించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమం లో అయ్యప్ప సేవాసమితి సభ్యులు గోపాలకృష్ణ గురు స్వామి , ధూపం నాగరాజు , సభ్యులు బలిజ లింగేశ్వర్ , పొగాకు అనిల్ కుమార్ , విశ్వనాథం గంగాధర్ , వేముల సుధాకర్ రెడ్డి , నరేష్ సాగర్ , కట్ట శ్రీనివాసులు ,రాజశేఖర్ తదితరులున్నారు.