నారాయణపేట, జూలై 19 : ‘వచ్చేది తమ ప్రభుత్వమే.. పోలీసులు ఈ విషయాన్ని గుర్తుకుపెట్టుకొని విధులు నిర్వహించాలి.. పోలీసులు న్యాయం పక్షాన ఉండాలే తప్పా కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితో తప్పుడు కేసులు నమోదు చేయొద్దు.. అత్యుత్సాహం ప్రదర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదు.. ఖబడ్దార్’.. అంటూ బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. కూసోడానికి జాగా కూడా లేకుండే.. అలా ంటిది జిల్లాలో ఎకడా లేని విధంగా నారాయణపేటలో అధునాతన పోలీస్‌స్టేషన్ భవనం తెచ్చిందే తాను .. ఈ విషయాన్ని పోలీసులు గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు.
శనివారం నారాయణపేట మండలం కోటకొండలో బీఆర్ఎస్ మండల స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని మండల పార్టీ అధ్యక్షుడు వేపురి రాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజేందర్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ నియోజకవర్గ రైతులపై కానీ.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఒంటిమీద కానీ ఈగ వా లినా.. సమాచారం అందుకున్న వెంటనే వచ్చి ఆదుకుంటానని భరోసానిచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం విషయంలో భూములు కోల్పోయే రైతులకు అండగా ఉండామన్నారు. అవసరమైతే జైలుకు వెళ్లడానికి సైతం సిద్ధంగా ఉ న్నామని స్పష్టం చేశారు. లగచర్లలో భూములు కోల్పోయే రై తులకు ఎకరాకు రూ.30 లక్ష లు ఇస్తారు.. కొడంగల్ ఎత్తిపోతలలో భూములు కోల్పోతే మాత్రం ఎకరాకు రూ.14 లక్షలు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. 19 నెలల కాంగ్రెస్ పాలనలో ఊర్లల్లో రోడ్లు ఊడ్చే పరిస్థితి లేద ని, మురుగు తీసే పరిస్థితి లేదని.. ట్రాక్టర్లకు డీజిల్ పోసే దాఖల్లేవన్నారు. కనీసం సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికలోల యువతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటికీ తనకు ప్రజల్లో ఆదరణ తగ్గలేదని అన్నారు. 2014 ఎన్నికలోల మొదట సారి పోటీ చేస్తే 40 వేల ఓట్లు వచ్చాయని, 2018 ఎన్నికల్లో 68 వేల ఓట్లు వచ్చాయని.. 2023 ఎన్నికల్లో పోటీ చేస్తే 76 వేల ఓట్లు వచ్చాయని తెలిపారు. ప్రతి ఎన్నికల్లో ప్రజల నుంచి ఆదరణ పెరుగుతూ వచ్చిందే తప్పా తగ్గలేదని అన్నారు. ప్రజలు తనపై, తన పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉన్న అభిమానమే ఇందుకు నిదర్శనమన్నారు.
కాంగ్రెస్ రాక్షస రాజ్యంతో 19 నెలల పాలనలో ప్రజలు విసిగి పోయారని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో యావత్తు ప్రజలందరినీ తెలంగాణ బిడ్డలేనని కడుపులో పెట్టుకొని చూసుకున్నామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే రాక్షస రాజ్యం వస్తుందన్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించాలని కోరారు.
బీజేపీ సిద్ధాంతం ఎకడ పోయింది.. 2014 ఎన్నికల్లో టెంకాయ గుర్తు మీద పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి 23 వేల ఓట్లు వచ్చాయని, 2018 ఎన్నికల్లో అదే పార్టీ అభ్యర్థికి 20 వేల ఓట్లు వచ్చాయని, 2023లో 17 వేల ఓట్లు వచ్చాయని తెలిపారు. మరి 2023 ఎన్నికల్లో మిగతా 6వేల ఓట్లు ఎవరికి అమ్ముకున్నారని కమలం పార్టీ నాయకులను ప్రశ్నించారు. చస్తే బీజేపీ కండువా కప్పుకొనే చస్తామని గప్పాలు కొడుతూ గొప్పలు చెప్పుకొనే కొంత మంది బీజేపీ నాయకులకు ఎన్నికల్లో బీజేపీ సిద్ధాంతం ఎకడపోయిందన్నారు.
ఇదేనా మీ సిద్ధాంతమని ప్రశ్నించారు. పార్టీని నమ్ముకొని పోటీ చేసిన వారి గొంతుకోయడమే మీ సిద్ధాంతమా? అని నిలదీశారు. కోడలకు అత్త.. అత్తకు కోడలు.. నియోజకవర్గంలో బీజేపీ నాయకుల తీరు బయట బీజేపీ.. లోపల కాంగ్రెస్ తీరుగా ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనని ప్రజలు తెలుసుకోవాలన్నారు.
అనంతరం పలువురు గ్రామ స్థాయి నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను గెలిపించుకొని బహుమతిగా ఇస్తామన్నారు. ఓడినా రాజేందర్‌రెడ్డికి ఆదరణ మాత్రం తగ్గలేదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రాములు, వెంకట్రాములుగౌడ్, లక్ష్మీకాంత్, అలీ షేర్, రవికుమార్, రాజు, వెంకటేశ్, చందు యాదవ్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.