నాగర్‌కర్నూల్, నవంబర్ 29 : ఓటుకు నోటు కేసు వ్యవహారంలో నిందితుడిగా తేలిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీ ఎం పదవికి అనర్హుడని, అబద్ధపు హా మీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగెస్ ప్రభుత్వంలో సీఎం కుర్చీలో కూర్చున్న రేవంత్‌రెడ్డి పదవిని అప్రతిష్టపాలు చేసే లా వ్యవహరిస్తున్నారని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, దీక్షా దివస్ కార్యక్రమ నాగర్‌కర్నూల్ జిల్లా ఇన్చార్జి విజయసింహారెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కాంగ్రెస్ ప్రభుత్వ రాక్షస పాలనపై మం డిపడ్డారు.
అంతకుముందు తెలంగాణ తల్లికి పూలమాల వేసి, అమరవీరులకు నివాళులర్పించారు. అదేవిధంగా కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశా రు. అనంతరం విజయసింహారెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దొంగమాటలు చెబుతూ పబ్బంగడుపుతున్నారన్నారు. వారు ప్రవేశపెట్టిన పథకాల అమలులో సీఎం, మంత్రు లు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారన్నా రు. ఎన్నికల ముందు చాలా మంది నాయకులను పార్టీలో చేర్చుకొని మనం మోసపోయామని, వా రిని నమ్మినందుకే బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారన్నారు. నాడు పిడికెడు మందితో మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించిన కేసీఆర్ వేలు, లక్షల్లో ప్రజలను సమకూర్చి ఏకం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సా ధించుకొని పదేండ్లలో అభివృద్ధి చేస్తే, మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే సత్యనాశనం చేసిందన్నారు.
తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించి వారితో కలిసి ఉద్యమం నడిపిన కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేంత వరకు పోరాడుదామని పిలుపునిచ్చారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరైనా తెలంగాణను దోచుకున్న వారేనని, ఒక్క కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యిందన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లావాడని, మా గ్రామ వాసి అని ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారంటే ఆయన పాలన ఏ విధంగా ఉందో ప్రజలకు తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు.
పార్టీలో పనిచేస్తూ గెలుపొందిన తర్వాత ప్రభు త్వం రాలేదన్న ఉద్దేశంతో పదవులకు తెలంగాణ వాదాన్ని కొందరు తాకట్టు పెట్టారని, అలాంటి వారిని ఎప్పటికీ నమ్మవద్దని అచ్చంపేట మాజీ ఎ మ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు అన్నారు. దీక్షా దివస్తోనే మన పోరాటాన్ని మరవద్దని, ఈ కార్యక్రమాన్ని నిత్యం గుర్తు చేసుకునేలా ఉంటేనే మన ముందు తరాలు గుర్తు చేసుకుంటాయన్నారు. మభ్యపెట్టే మాటలు చెప్పిన, అమలుకానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి మోసం చేస్తున్న వారికి ప్రజలు కచ్చితంగా బుద్ధ్ది చెబుతారన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత మేమిచ్చినం రాష్ట్రం అని మాట్లాడితే ప్రజలు వారి మాటల్ని నేలకేసి కొట్టారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రితో సహా తెలంగాణకు వ్యతిరేకంగా తుపాకులు పట్టుకొని తిరిగినోళ్లు, తెలంగాణ అంటేనే కేసులు బనాయించినోళ్లు నేడు కేసీఆర్ పోరాటాన్ని, పదేండ్ల పాలనను తక్కువ చేసి మాట్లాడుతుండడం సిగ్గుచేటన్నారు. చరిత్రను ఎవరూ చెరుపలేరని, ప్రజలకు మంచి సేవలు అందించిన వారిని మరువరన్నారు.
పోరాటానికి పునాది వేసిన రోజు : మర్రి
నాటి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం సాధనలో భాగంగా చేపట్టిన పోరాటానికి పునాది వేసిన రోజును దీక్షా దివస్‌గా జరుపుకొంటున్నామని, జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో త రలివచ్చిన కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే మర్రి జ నార్దన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల్లో ఉద్య మ స్ఫూర్తి నింపుతూ పోరాటంతో రాష్ర్టాన్ని సాధించిన గొప్ప ధీరుడు కేసీఆర్ అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రె డ్డి విమర్శించారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు సా ధించుకొని ప్రశాంతంగా సాగుతున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకుడు కేసీఆర్ రాష్ర్టానికి మహాశక్తి అని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అ న్నారు. ఎన్నో కలలు కని బంగారు తెలంగాణగా మార్చుకుందామని రాష్ర్టాన్ని సాధించి పదేండ్లు అభివృద్ధి చేస్తే పదకొండు నెలల్లోనే అనుభవం లేని వారి చేతుల్లో తెలంగాణ నాశనమైందన్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గంలోనూ అభివృద్ధి జరగలేదన్నారు.