మద్దూర్ (దుద్యాల), ఆగస్టు 11 : వ్యవసాయమే జీవనాధారంగా చేసుకున్న రైతన్నల గుండెల్లో ఫార్మా చిచ్చురేపుతున్నది. కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న ఎమ్మెల్యేనే సీఎం అయ్యారు. ఆ ఆనందం రైతుల కండ్లల్లో ఎంతో కాలం నిలవలేదు. అభివృద్ధి చేస్తున్నామంటూ పచ్చని పొలాలను ఫార్మా కంపెనీ పేరిట లాక్కుంటుండడంతో వారి గుండెల్లో గు దిబండ మోపినంత పనైంది. ఫార్మా ఏర్పాటు కోసం రైతులను సంప్రదించకుండా అధికారులు ఏకపక్షంగా సర్వే చేసి 1,274 ఎకరాలను సేకరించారు. ఈ క్రమం లో ఆదివారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం హకీంపేట గ్రా మంలో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా పోలేపల్లి, ల గచర్ల, రోటిబండ తండా, పులిచెర్లకుంట తండా రైతు లు ధర్నా చేపట్టారు.
ఫార్మావద్దు.. వ్యవసాయం ము ద్దు అంటూ రైతులు నినాదాలు చేశారు. విషయం తె లుసుకున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నిరసనకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పేరిట నియోజకవర్గ ప్రజలను మోసం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి అనేది ప్రాంతానికి, ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలని.., సొ ంత లాభం కో సం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ భూములను లాక్కోవడం ఎంతవరకు స మంజసమని ప్రశ్నించారు. హైదరాబాద్ శి వారులో ప్రజలు వ్యతిరేకించిన కంపెనీలను కొడంగ ల్కు తరలించి ఇక్కడి రైతుల పొట్ట కొట్టొద్దన్నారు.
హకీంపేటలో 505, పోలెపల్లిలో 130, లగచర్ల, పులిచర్ల, రోటిబండతండాల్లో 643 ఎకరాలను లాక్కునేందుకు సీఎం కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రైతులను బెదిరించి బలవంతంగా భూములను లా క్కుంటే.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎంతటి పో రాటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. కలుషితం చేసే కంపెనీలను తీసుకొస్తే స్వాగతించేది లేదని హె చ్చరించారు. నియోజకవర్గంలో 1,154 ఎకరాల ప్ర భుత్వ సీలింగ్ భూమి అన్యాక్రాంతమైందని, వాటి వ ద్దని సాగు భూములు లాక్కోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇక్కడి ప్రజలు రేవంత్‌రెడ్డికి సీఎం పదవిని కట్టబెడితే..
ఆయన మాత్రం కాలు ష్య వాతావరణాన్ని గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓపక్క కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతలతో సాగునీరందిస్తామని చెప్పుకొంటూ.. మరోపక్క రైతుల భూములను ఆక్రమించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విధంగా సాగు భూ ములను లాక్కుంటూపోతే ఎత్తిపోతలతో ఎవరికీ ఉపయోగం ఉండదన్నారు. ఫార్మా కంపెనీల స్వ లాభం కోసమే ఎత్తిపోతలను తీసుకొస్తున్నట్లు ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ మెడికల్, ఇంజినీరింగ్, వెటర్నరీ కళాశాలల ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు. అమెరికా పర్యటనలో తెలంగాణకు వచ్చే టెక్స్టైల్, టెస్లా, ఐటీ కంపెనీలను తీసుకొచ్చి కొడంగల్‌లో ఏర్పాటు చేసి ఉ ద్యోగావకాశాలు కల్పిస్తే స్వాగతిస్తామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ శా సం రామకృష్ణ, మాజీ జెడ్పీటీసీ కోట్ల మహిపాల్, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు ఎరాన్పల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.