బిజినపల్లి : మండలంలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్( BRS ) గ్రామ అధ్యక్షుడు కృష్ణయ్య తండ్రి బాలస్వామి అనారోగ్యంతో మృతి చెందాడు. వారి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Marri Janardhan ) శనివారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించి కుటుంబీకులను ఓదార్చారు. అదే గ్రామానికి చెందిన శేఖర్ తల్లి ఇటీవల మృతి చెందగా ఆ కుటుంబాన్ని సైతం పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, పులేందర్ రెడ్డి, మల్లికార్జున్, కృష్ణయ్య, వెంకటయ్య, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.