బిజినపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో ఆదివారం నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Marri Janardhan Reddy) జన్మదిన వేడుకలను( Birthday) బీఆర్ఎస్ ( BRS) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారి కూడలిలో కేక్ కట్ చేశారు. అనంతరం మిఠాయిలు ,పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, పులిందర్ రెడ్డి, చిన్నారెడ్డి, బాలస్వామి, మహేశ్వర్ రెడ్డి, తిరుపతిరెడ్డి, మహేశ్వరరావు, శ్రీశైలం, శంకర్ గౌడ్, శీను, రవీందర్ రెడ్డి, స్వామి, తిరుపతయ్య తదితరులు ఉన్నారు.