గండీడ్/మహ్మదాబాద్, అక్టోబర్ 6 : స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి పిలుపునిచ్చారు. గండీడ్ మండల కేంద్రంలో గండీడ్, మహ్మదాబాద్ మండలాల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అధికారంలో లేమని కార్యకర్తలు అధైర్యపడొద్దని కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉండి వారిని కాపాడుకుంటానని భరోసా కల్పించారు. రైతు రాజ్యం అంటూ రైతు ల కంట నీరు పెట్టించిన ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చె ప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ దొంగ బుద్ధి ని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి నేడు తూతూ మంత్రంగా 42శాతం పై జీవో విడుదల చేసి వాళ్ల పార్టీ నాయకులతోనే కోర్టుల్లో కేసులు వేయిస్త్తూ నాటకమాడుతున్నారని విమర్శించారు. అనంతరం ఆరు గ్యారెంటీల బాకీ కార్డును విడుదల చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి మండలాల బీఆర్ఎస్ అధ్యక్షుడు భిక్షపతి, పెంట్యానాయక్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచులు వెంకట్రామిరెడ్డి, గోపాల్, నీలేశ్ నాయక్, గీతాపాండు, రఘుయాదవ్, నాయకులు రాజ్‌కుమార్‌రెడ్డి, బాలవర్దన్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, నర్సప్ప, కృష్ణ, జనార్దన్‌గౌడ్, వెంకటయ్య, వెంకట్‌రెడ్డి, దస్తయ్య, ద్యానమోని కృష్ణయ్య, సత్యనారాయణరెడ్డి, అశోక్‌గౌడ్, గోపాల్‌రెడ్డి, రాజేశ్వర్ ఉన్నారు.